ఈ జనరేషన్ నుంచి మొదలుకుని ఓల్డ్ జనరేషన్ వరకు ప్రజెంట్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండటం చాలా తక్కువ. ప్రతీ ఒక్కరు బిర్యానీ ప్రియులే అని చెప్పుకోవచ్చు. కాగా, బిర్యానీ మీద ఉన్న ఇష్టం కాస్తా ఓ మహిళా ఐపీఎస్ అధికారికి చిక్కులు తెచ్చిపెట్టింది. అదేంటీ? బిర్యానీ అధికారిణికి ఇష్యూస్ తెచ్చిపెట్టడం ఏంటి? అనుకుంటున్నారా? అవునండీ..మీరు చదివింది నిజమే. బిర్యానీ వల్ల ఆమెపై విచారణ కూడా షురూ అయిందండోయ్. అది ఎలాగో తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.


మహారాష్ట్ర స్టేట్‌లోని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేశీ ఘీ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఈ రెస్టారెంట్‌లో బిర్యానీ ఒకసారి తింటే చాలు.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుందట. ఈ క్రమంలోనే ఈ రెస్టారెంట్ బిర్యానీకి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.  ఈ ప్రాంతంలో డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ విదులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె లంచ్ టైం‌లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? అన్న విషయమై సబ్ ఆర్డినేట్‌ను ప్రశ్నించింది. తర్వాత బిర్యానీయే బాగుంటుందనుకున్న ఆమె ఏ రెస్టారెంట్‌లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగింది. దేశీ ఘీ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగా రుచిగా ఉంటుందని సబ్ ఆర్డినేట్ తెలిపాడు.

ఈ తరుణంలో ఆమె అక్కడి నుంచే మటన్ బిర్యానీ తెప్పించాలని కోరారు. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్టాడించాలని చెప్పింది. అయితే, తాము ఎప్పుడూ బయటి నుంచి ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లిస్తుంటాం అని సబ్ ఆర్డినేట్ తెలిపాడు. ఇందుకు బదులుగా మన పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా ? అని సదరు మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అడిగింది. స్థానిక ఇన్‌పెక్టర్ చూసుకుంటాడని చెప్పింది. ఈ మేరకు సంభాషణలు జరిపినట్లు వచ్చినఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో పోస్టు కావడంతో అది నెట్టింట ప్రస్తుతం తెగవైరలవుతోంది. కాగా, ఈ ఆడియో పట్ల మహిళా అధికారి స్పందించారు. ఈ క్రమంలోనే  తన వాయిస్‌తో ఉన్న ఒక  ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేశారని ఆమె ఆరోపణలు చేశారు.
 
మొత్తంగా ఫ్రీ గా బిర్యానీ తిందామని మహిళా అధికారి అనుకున్నారో? లేరో తెలియదు కానీ మహిళా అధికారిని ఫ్రీ బిర్యానీ కాస్త వివాదాల్లోకి నెట్టింది. తన జోన్‌లో పని చేస్తున్న సీనియర్ అధికారుల కుట్ర వల్లే ఇలాంటి రికార్డింగ్స్ బయటకు వచ్చాయని ఆమె చెప్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పింది. కాగా, ఈ విషయం హోం మంత్రి వరకు వెళ్లగా, వెంటనే విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను హోం మంత్రి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: