కరోనా పుణ్యమా అని అన్నీ రేట్లు పెరిగిపోాయాయి. చాలా మంది నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. తాాగా పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ సెంచరీలు కొట్టాయి. ఇలాంటి స్థితిలో పెట్రోల్ ను తక్కువ రేటుకే ఇస్తారని చెబితే చాలు జనాలు క్యూ కడుతారు. ఒక వేళ పెట్రోల్ ను ఉచితంగానే ఇచ్చేస్తామని చెబితే కనుక ఇక చెప్పాల్సిన పనిలేదు. పెట్రోల్ బంకుల వద్ద జనాలు కిక్కిరిసిపోతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెట్రోల్ ఫ్రీ ఇస్తామంటూ ఓ వ్యాపారి ప్రకటించడంతో అందరూ ఆ షాపు ముందు క్యూ కట్టారు. అయితే పెట్రోల్ ఫ్రీగా పొందాలంటే మాత్రం ఇంకోకటి కొనాల్సి ఉంటుంది. అది మరేదో కదా చేపలు. తమ షాపులో రూ.500లకు పైగా చేపలను కొన్నట్లైతే లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు షాపు యజమాని ప్రకటించారు. ఈ ఆఫర్ తమిళనాడులోని మధురై సిటీలో ఓ వ్యాపిరి పెట్టాడు. షాపు ఓనర్ పెట్టిన ఇటువంటి ఆఫర్ కు అందరూ ఆశ్చర్యపోయారు.

వెంటనే వాళ్లు ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆదివారం రోజు నుంచి ప్రజలు ఆ షాపు ముందు క్యూ కట్టారు. చేపలు కొనుగోలు చేసిన వారికి పెట్రోల్ కోసం కూపన్లను కూడా ఇచ్చారు. చేపల షాపు ఓనర్ మాట్లాడుతూ తన షాపులో చేపలు కొనుగోలు చేసేవారు కనుమరుగయ్యారని తెలిపాడు. కొన్ని రోజుల నుంచి వ్యాపారం సవ్యంగా సాగడం లేదని తెలిపాడు. దీంతో చేపలు చాలా మంది 500 రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, తాము 500 రూపాయల కంటే ఎక్కువ ధరకు చేపలను అమ్ముతున్నట్లు తెలిపాడు. ఇదేవిధంగానే దిండిగల్‏లోని ఓ మాంసాహార షాప్ కూడా ఈ మాదిరిగానే ఆఫర్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ అనంత్ మటన్ దుకాణంలో ఒక కిలో మటన్ కొంటే రూ.100 విలువ చేసే ఒక వెండి పాత్రను రూ.690 తగ్గింపు ధరకే ఇస్తున్నట్లు ఆఫర్ ను ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: