సాధారణంగా పెళ్లిళ్లకు హాజరైన బంధుమిత్ర వర్గాల వారందరూ కట్నాల కింద డబ్బులు బహుమతిగా ఇస్తూ ఉంటారు. అందరూ ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్న నా నిబంధన ఏమీ లేదు ఎవరి స్థోమతకు తగ్గట్టుగా ఎవరికి నచ్చిన అంత వారు బహుమతి కింద ఇస్తూ ఉంటారు.. అయితే ఎవరైనా , ఎప్పుడైనా ఈ విషయాన్ని ఒకసారి గమనించారా..? అదేమిటంటే పెళ్లిళ్లలో కట్నాలు చదివించేటప్పుడు రూ. 116 , రూ.216, రూ.516, రూ. 1016 ఇలా కేవలం 16 నెంబర్ వచ్చేలాగా కట్నాలు చదివిస్తూ ఉంటారు.. అయితే ఈ విషయాన్ని చాలా మంది గమనించక పోయినప్పటికీ ఎవరికో ఒకరికి ఎక్కడో ఒకచోట సందేహం కలగకమానదు.. అయితే ఇలా ఎందుకు ఈ నంబర్ వచ్చేలాగా కట్నాలు చదివిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం..


కొన్ని విషయాలలో మనం పెద్దవాళ్ళను అనుకరిస్తాం అనడంలో ఈ కట్నాల చదివింపులు గొప్ప నిదర్శనం అని చెప్పవచ్చు.. ఇలా ఎందుకంటే మన పూర్వీకులు కూడా పెళ్లిళ్లలో కట్నాలు చదివించే టప్పుడు రూ. 116 , రూ.216, రూ.516, రూ. 1016, రూ.5016 ఇలా  చదివిస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇలాగే కట్నాలు చదివిస్తున్నారు అని కొంతమంది చెబుతూ ఉంటారు.. సాధారణంగా అంటే చివర్లో ఉన్న వచ్చేలాగా కట్నాలు చదివించ కుండా 1 , 2, 3 ,4 అంకెలు కూడా రావచ్చు కదా కేవలం 16 అనే నంబర్ ను  మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే సందేహం కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.


 నిజాం పరిపాలనతో పోల్చుకుంటే  ఆంధ్రాప్రాంతం వారి లెక్కలు సైతం తేడాగా ఉండేవి. నిజాం ప్రాంతం వారు ఆంధ్రా ప్రజలకు చెల్లింపులు చేసేటప్పుడు 100 రూపాయలకు 16 చెల్లిస్తేనే సమానం అయ్యేది. నిజాం పాలనలో ఉన్న  ప్రజలు వాడే మారకం విలువ కూడా  తక్కువగా ఉండేది. అందుకే వంద రూపాయలు చెల్లించాలి అంటే,  అదనంగా  16 రూపాయలు జమ  చేయాల్సి ఉండేది. అందుకే ఇలా పదహారు రూపాయలు ఆడ్ చేసి పెళ్లిళ్లలో కట్నాలు చదివించడం జరుగుతుంది..


అంతేకాదు ముస్లింలకు 786 నెంబర్ ఎలాగో.. హిందువులలో నార్త్ ఇండియన్స్ కి కూడా 116  అనే నంబర్  అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు మర్వాడి  కొట్టులో 116 బిల్లు చేస్తే వారు ఎంతో సంతోషించేవారు అట.. అంతేకాదు 116 అనేది కృష్ణుడి నెంబర్ గా వారు భావిస్తారు. ఇక వీటితో పాటు రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: