భావోద్వేగాలలో కోపం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.. సంతోషం వచ్చినప్పుడు ఎలా అయితే  ఎక్స్ప్రెస్ చేస్తామో.. కోపం వచ్చినప్పుడు కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేయాలి.. నిజానికి ఎవరైనా కోపం తెచ్చుకున్నప్పుడు.. మిగతావాళ్లు కోపాన్ని తగ్గించుకోమని చెబుతూ ఉంటారు
.. అలా ఇతరులు తమ కోపాన్ని తగ్గించుకోమని చెప్పినప్పుడు రోజురోజుకు కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల అది ఏదో ఒక రోజు పెద్ద సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. మనలో ఎలాంటి  భావాలు కలిగినా వాటిని తప్పకుండా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందట.

అయితే కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు.. కొందరు గట్టిగా అరిస్తే, మరికొంతమంది కోపాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు.. కొంతమంది కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు.. ఇలా కోపం వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం వల్ల వారిలో ద్వేషం మరింత పెరిగి, ఇతరులపై కక్ష పెట్టుకునే  అవకాశం కూడా ఉంటుందట. ఇక ఎవరైనా సరే కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచి, మీ కోపాన్ని తగ్గించుకోవాలి.. కానీ ఇతరుల మీద మీ కోపం ప్రభావాన్ని చూపించకూడదు.

ఇక ముఖ్యంగా ఒక కోప్పడుతున్న వ్యక్తిని మనం ఎదుర్కోవాలని చూడకూడదు.. కోపంలో ఉన్న వ్యక్తితో వాదనలకు దిగితే, అది చిన్నది కాస్త పెద్ద గొడవ గా మారే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు కోప్పడినప్పుడు క్షమాపణలు చెప్పితే, పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. కోపం వచ్చినప్పుడు కొంతమంది ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ప్రశాంతంగా వస్తూ ఉంటారు.. మరి కొంత మందికి బయటకు వెళ్ళిన తర్వాత మరింత కోపం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది..

కోపం వచ్చినప్పుడు ద్వేషానికి దారి తీయకుండా ఉండాలి అంటే, మనలో మనమే మన కోపాలను ఎప్పటికప్పుడు ప్రదర్శించి తరువాత పరిస్థితులన్నీ చక్కబెడుతూ ఉండాలి..ఇలా చేసినప్పుడే  మనిషి ఆరోగ్యంగా ఇతరులతో సంతోషంగా జీవించగలుగుతాడు.. మనలో కోపం రాకుండా  అణచుకోవడం వల్ల మానసికంగా కృంగిపోయి, తీవ్రమైన అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి కోపం వచ్చిన వెంటనే ఎక్స్ ప్రెస్ చేయండి.. మనస్సులో దాచుకోకుండి.


మరింత సమాచారం తెలుసుకోండి: