పని చేయాలనే ఆలోచన.. పట్టుదల.. కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చు అని నిరూపిస్తోంది ఇక్కడ ఒక మహిళ.ఆమె రాగి పిండితో లడ్డు తయారు చేసి, మార్కెట్లో విక్రయిస్తూ ప్రస్తుతం నెలకు లక్ష రూపాయలను సంపాదిస్తోంది.. ఈమె వ్యాపార కథ గురించి ఒకసారి తెలుసుకుందాం..


పూణె సమీపంలో వడ్నేర్‌ భైరవ్‌ అనే గ్రామం..ఆ గృహిణి పేరు సుచేత భండారే.. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టి రాగి పిండితో లడ్డు తయారు చేయడం మొదలు పెట్టింది. ఇక వాటిని ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా హోమ్ డెలివరీ చేస్తూ.. నెలకు లక్ష రూపాయలను సంపాదిస్తోంది ఈమె. సేంద్రియ ఎరువులతో పండించిన రాగులతో తయారు చేసి లడ్డు అమ్మకాలు చేపట్టడం వల్ల , ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు..

అవిసె గింజల పొడి..  ఎండు ఖర్జూరం, బాదాం.. తో తయారు చేసి లడ్డులకు చాలా ప్రత్యేకత ఉంటుంది.. ఇక సుచేత భండారే  మాత్రం ఈ లడ్డూను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనం చూసినట్లయితే రాగి పిండి, ఆవు నెయ్యి, బెల్లం, బాదం పొడి, అవిసె గింజల పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకులు. వీటితో సుచేతా రాగిలడ్డూలు తయారు చేసి..ఒక  16 లడ్డూలను తీసుకొని  ఒక మంచి అట్టపెట్టెలో పెట్టి విక్రయిస్తుంది.. ఇక ఒక్కొక్క పెట్టే ధర  రూ.439.. ఇక వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కడెక్కడినుంచో ఫోన్ చేసి మరి కొనుగోలు చేస్తూ ఉంటారు..

అయితే కేవలం ఈమె సొంతం గా పని చేయడమే కాకుండా  తన గ్రామంలో ఉన్న  మరో  10 మంది మహిళలకు కూడా ఉపాధి కల్పించింది. మీరందరూ కలిసి నెలకు 2,500 రాగి లడ్డూలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఏమి ఇంటి నుంచి లడ్డూలను తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తూ ఉంటుంది. ఐదు వేల రూపాయల తో మొదలుపెట్టిన ఈమె బిజినెస్ ప్రస్తుతం నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అంతే కదా ఒకసారి ఈమె లడ్డూలను రుచి చూసిన వారు, ప్రతి సారి  ఆర్డర్ చేసి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు.


'ఎర్త్‌పూర్ణ' అనే ఒక సంస్థను ప్రారంభించింది ..ఇక దీని ద్వారా బలవర్ధకమైన పదార్థాలను మనకు ఈమె అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: