మన రాష్ట్రంలో ప‌లు న‌గ‌రాల్లో బ్యాచ్‌ల‌ర్ అబ్బాయిల‌కు రూం లు అద్దె కు ఇవ్వాలంటే ఇంటి య‌జ‌మాన‌లే కాస్త సంకోచిస్తారు. బ్యాచ్‌ల‌ర్ అబ్బాయిలు రూం ల‌ను శుభ్రం ఉంచు కోరు అని అపార్ట్ మెంట్ య‌జ‌మాన‌లు అంటు ఉంటారు. అలాగే బ్యాచ్‌ల‌ర్ అమ్మాయిల‌కు రూం ల‌ను అద్దెకు అల‌వొక గా ఇస్తారు. వారు రూం ల‌ను శుభ్రం గా ఉంచుతారు. పైగా వారికి ఎలాంటి చెడు అల‌వాట్లు ఉండ‌వ‌ని అంటారు. కానీ ఒక న‌గ‌రంలో దీనికి భిన్నంగా జ‌రుగుతుంది. ఆ న‌గ‌రంలో బ్యాచ్‌ల‌ర్ అమ్మాయిల‌కు రూం లు అద్దె కు ఇవ్వాలంటే పార్ట్‌మెంట్ య‌జ‌మానులు జంకుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.ఈ మ‌ధ్య కాలంలో మ‌హిళ‌లు వంటీంటి కి ప‌రిమితం కాకుండా  ఉద్యోగాలు చేయ‌డానికి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అలాగే అమ్మాయిలు చ‌దువుకునేందుకు గ్రామాల‌ను వ‌దిలి న‌గ‌రాల బాట ప‌డుతున్నారు.  అయితే ఇలాంటి వారికి కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అహ్మ‌దాబాద్ నగ‌రంలో వీరికి ఇల్లు అద్దె కు ఇవ్వ‌డానికి య‌జ‌మానులు పెట్టే రూల్స్ ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి. వీరికి ఇల్లు అద్దె కు ఇవ్వాలంటే వారు ఇష్టం వ‌చ్చిన దుస్తులు ధ‌రించ‌డానికి వీలు లేదు. మోడల్, అల్ట్రా మోడ‌ల్ దుస్తులు వేస్తే అస‌లు ఇల్లే అద్దె కు ఇవ్వ‌రు. అంతే కాకుండా అహ్మ‌దాబాద్ న‌గ‌రంలోని వైష్ణో దేవీ ఏరియాలో ఉన్న ర‌త్నా పార‌డైజ్ అపార్ట్ మెంట్ సొసైటీ స‌భ్య‌లు అయితే ఏకంగా బౌన్స‌ర్ ల‌తో దాడులు చేస్తున్నారు.
ఈ సొసైటీలో ఉన్న విద్యార్థినుల‌ను దాడుల చేయ‌డంతో ఆ ఫ్లాట్ య‌జ‌మాని  యోగేష్ ప‌టేల్ ను విద్యార్థినులు సంప్ర‌దించార‌ట‌. దీంతో సొసైటీ స‌భ్య‌ల తీరును యోగేష్ త‌ప్పు ప‌ట్టార‌ట‌. దీంతో సొసైటీ స‌భ్య‌లు యోగేష్ ప‌టేల్ పై పోలీస్ స్టేష‌న్ లో ఫీర్యాదు చేశార‌ట‌. దీంతో పోలీసులు కూడా యోగేష్ నే ఇబ్బందులు పెట్టార‌ట‌. ఇలా ఆహ్మ‌దాబాద్ న‌గ‌రంలో అమ్మాయిల‌కు ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఆపార్ట్ మెంట్ సొసైటీ స‌భ్య‌లు అనేక రూల్స్ పెడుతున్నారు. అవి కుద‌ర‌దు అంటే ఇలా దాడులు చేస్తున్నారు. వీటి కి పోలీసుల స‌పొర్ట్ కూడా ఉంద‌ని విద్యార్థినులు అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: