టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమా ల‌న్నీ రీమెక్ లే. త‌మిళం, క‌న్న‌డ వంటి భాషాల‌లో హిట్ అయిన సినిమాల కథ ల‌ను సెల‌క్ట్ చేసుకుని తెలుగు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ లో మంచి క‌థ‌లు ఎక్కువ రావ‌డం లేద‌ని అందుకే రీమెక్ సినిమాలు చేయ‌డానికి హీరో లు ఏ మాత్రం సంకో చించ‌డం లేద‌ని ప‌లువ‌రు అంటున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ చాలా మంది హీరోలు రీమెక్ చేశారు. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, కాట‌మరాయుడు వంటి సినిమాలు చేశారు. దీనిలో గ‌బ్బ‌ర్ సింగ్ ఒక‌టే హిట్ అయింది. మిగిలిన సినిమాలు అంత‌గా ఆడ‌లేదు.
తాజాగా మెగాస్టార్ చిరంజివి వ‌రుస‌గా రీమెక్ సినిమాలు చేయ‌డంతో చాలా అభిమాన‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఒక అభిమాని ఎకంగా చిరంజీవికి లేట‌ర్ రాశాడు.  ప్ర‌స్తుతం ఈ ఉత్తరం ట్వీట్ట‌ర్ వైర‌ల్ గా మారింది. మేము ఇప్ప‌టికే చూసిన సినిమాలో మ‌ళ్లి మీరు క‌నిపిస్తే పాత హీరో నే క‌నిపిస్తాడు కానీ మీరు క‌నిపించ‌రు అని ఆ ఉత్త‌రం లో రాశాడు. ఎన్టీఆర్ న‌టించిన క‌న్యాశుల్కం సినిమాలో ఎన్టీఆర్ క‌నిపించ‌డ‌ని.. గిరీశం మాత్ర‌మే క‌నిపిస్తాడ‌ని అన్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజివి న‌టించిన చంట‌బ్బాయి సినిమాలో పాండు రంగా రావు క‌నిపిస్తారు అని అన్నాడు. దయ చేసి రీమెక్ సినిమా చేయ‌వ‌ద్ద‌ని అన్నాడు. కాగ మెగాస్టార్‌ చిరంజీవి ప్ర‌స్తుతం మూడు రీమెక్ సినిమాలు చేస్తున్నాడు. దీంతో పాటు కింగ్ నాగ‌ర్జున‌తో ఒక మ‌ల్టీ స్టార‌ర్ మూవీ చేస్తున్నాడ‌ని టాక్. ఇదీ కూడా వేక్ర‌మ్ వేద అనే త‌మిళ సినిమా ను రీమెక్ చేస్తున్నార‌ని స‌మాచారం. దీంతో మెగాస్టార్ అభిమానులు అస‌హానం వ్య‌క్తం చేస్తున్నారు. అయ్యయ్యో వ‌ద్దు అన్నరీమెక్ లు వద్దు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: