మనిషి చాలావరకు ఈ భూమ్మీద ఉన్న దేనినైనా డబ్బిచ్చి కొనగలము అని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు.. కానీ డబ్బులు ఇచ్చినా కూడా కొనలేనివి రెండే రెండు.. ఒకటి ప్రేమ , మరొకటి ఆరోగ్యం.. ఈ రెండు కూడా మనం కొనగలిగినట్లయితే ఈ భూ ప్రపంచంలో నేరాలు-ఘోరాలు అనేవి బహుశా ఉండవేమో. సాధారణంగా ఈ రెండు కూడా మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమ బయటపడితే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఒక రోజే కదా రెండు రోజులే కదా అంటూ మనం అలవాటు చేసుకొనే కొన్ని దురలవాట్లు వల్ల మన మెదడులో కూడా కణాలకు ఆక్సిజన్ అందక రక్తసరఫరా జరగకపోవటం.. ఫలితంగా రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందట..


ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.. సాధారణంగా బ్రెయిన్ టిష్యూల లోకి ఆక్సిజన్ లేదా పోషక పదార్థాలు వెళ్ళ లేని సమయంలో ఆ ప్రదేశంలో రక్తం గడ్డ కట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ టాబ్లెట్స్ వల్ల కొంచెం రిజల్ట్ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి.కాబట్టి ఇలాంటి వాటిని మీరు కూడా తీసుకున్నట్లయితే వెంటనే నిలిపి వేయడం మంచిది.


జీవనశైలిలో మార్పుల కారణంగా కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారంలో సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. చాలామంది ధూమపానం, మద్యపానం వంటివి చేస్తూ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆడ , మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ  బ్రెయిన్ స్ట్రోక్ బారినపడే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: