అయితే ఇక అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేస్తున్న పనులను ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంకే స్టాలిన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తాను ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెబుతున్నాయి అని చెప్పాలి. ఇక ఎం.కె.స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలపై విశ్లేషకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇకపోతే ఇటీవల ఎంకే స్టాలిన్ చేసిన పనికి జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారూ. సాధారణంగా సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సు ఎక్కడం లాంటివి ఎప్పుడైనా చూసారా.. ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్సు ఎక్కడం ఏంటి అంటూ ఉంటారు ఎవరైనా.. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాత్రం ఏకంగా ఒక ఆర్టీసీ బస్సులో ఎక్కారు ఈ క్రమంలోనే బస్సులో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమగా పలకరించారు. చెన్నైలోని టీ నగర్ నుంచి కన్నకి నగర్ వరకు సిటీ బస్సు ప్రయాణం చేస్తుంది.ఈ క్రమంలోనే అక్కడి వరకు కాన్వాయ్ లో వచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నడుస్తున్న బస్సులో ఎక్కేసారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు