భారత క్రికెట్లో ఒకప్పుడు మిస్టర్ కూల్ కెప్టెన్ గా భారత జట్టుకు తిరుగులేని విజయాలను అందించిన మహేంద్రసింగ్ ధోని.. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా జట్టుకు  విలువైన సలహాలు ఇచ్చే మెంటార్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  తన సలహాలు సూచనలు అనుభవంతో టీమిండియాను మరింత పటిష్టంగా మార్చడానికి మహేంద్రసింగ్ ధోనిని టీమిండియా మెంటార్ గా నియమించింది.  కాగా ప్రస్తుతం ఆటగాళ్ల ప్రాక్టీస్ లో భాగమైన మహేంద్రసింగ్ ధోని ఆటగాళ్లకు సలహా ఇవ్వడంతో పాటు ఎంతో బాగా ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నాడు.



 అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సలహాలు తీసుకోవాలని ప్రతి ఒక క్రికెటర్ భావిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే  కేవలం భారత క్రికెటర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు సైతం మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. ధోని నుంచి విలువైన సలహాలు తీసుకోడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ధోని కూడా కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ ముగిసిన అనంతరం యువ క్రికెటర్లకు సలహాలు సూచనలు ఇవ్వడం లాంటివి కూడా అప్పుడప్పుడు చూశాం. ఇక ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ధోనీ ఇదే చేశాడు.


 నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఓటమి తర్వాత టీమిండియా మెంటార్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి చేరుకొని పాకిస్థాన్ క్రికెటర్లతో చిట్ చాట్ చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ అజమ్, మాలిక్, ఇమాద్ ధోని చుట్టూ చేరి పలు సందేహాలను అడిగారు. ఇక వాటికి సమాధానం చెప్పాడు ధోని. ధోని మాట్లాడుతున్న సమయంలో ఎంతో ఏకాగ్రతతో ధోని చెబుతున్న మాటలు పై దృష్టి పెట్టారు పాకిస్థాన్ క్రికెటర్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి క్రికెట్ స్పిరిట్ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: