సింగిల్స్ డే సందర్భంగా చైనా నిర్వహించిన ఓ ఆన్లైన్ షాపింగ్ ఈవెంట్ కి అనూహ్య స్పందన సంతరించుకుంది. అయితే ఈ ఈవెంట్ రికార్డు సతాయిలో పలు కంపెనీలు లాభాలను కొల్లగొట్టాయి. ఈ సింగిల్స్ డే సందర్భంగా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. అంటే దాదాపుగా 139 బిలియన్ డాలర్లు వసూలు జరిగింది. దాదాపు 6.3 లక్షల కోట్ల ఆర్డర్లు నమోదు కావడం జరిగింది . ఈ విధంగా మునుపెన్నడూ ఇలాంటి వ్యాపారం జరగలేదని తెలుస్తోంది . గత సంవత్సరం తో పోల్చుకుంటే 14% శాతం బిజినెస్ పెరిగింది .




గత సంవత్సరం సింగిల్స్ డే సందర్భంగా దాదాపుగా రూ. ఐదు లక్షల కోట్లను వసూలు అయ్యాయి. ఈ సంవత్సరం మాత్రం గత సంవత్సరం కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తూవుంది. ఈ సంవత్సరం జరిగిన పది లక్షల కోట్ల లలో దాదాపు ఆరు లక్షల కోట్లు అమ్మకాలు ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ అయినటువంటి అలీబాబా కంపెనీ నుండి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆన్లైన్ సింగిల్స్ డే ఈవెంట్లను చైనా లో 2009 నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మెగా ఈవెంట్ కి భారీగా స్పందన లభించడం తో ప్రతి ఏటా ఈ ఈవెంట్ లను కండక్ట్ చేస్తూవస్తున్నారు.  ఈ ఈవెంట్ లను నవంబర్ 11 న సింగిల్స్ డే గా  నిర్వహిస్తూవస్తున్నారు. ఈ ఈవెంట్ లకు అనూహ్య స్పందన పెరుగుతూ ఉంది.

దీన్ని బ్యాచిలర్స్ డే అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా నవంబర్ 11 జరిగే ఈ ఏవేట్ లో అంతరార్ధం లేకలేదు. ఈ తేదీని అంకెల్లో రాసినప్పుడు 11/11 గా వస్తుంది అంటే ప్రతి  '1' ని ఒక్కోవ్యక్తిగా పేర్కొంటారు. అనగా సింగల్ గా ఉన్న నలుగురు వ్యక్తుల్ని ఈ డేట్ చూచిస్తోంది. ఈవిధంగా బ్యాచిలర్స్ సెలెబ్రేట్ చేసుకునే ఈ ఈవెంట్ ని లేదా సందర్భాన్ని సింగిల్స్ డే గా పేర్కొంటారు. అయితే నలుగురు సింగల్ విద్యార్థులు నంజింగ్ విశ్వవిద్యాలయం లో 1990 సంవత్సరం లో సంబరంగా జరుపుకోవడం అన్ని విశ్వవిద్యాలయాలకు తెలిసింది.





అప్పటినుండి ఈ ఈవెంట్ ని అన్ని విశ్వ విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు జరుపోకోవడం ఆరంభించారు. ఈ విషయాన్నీ గమనించిన ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా 2009 నుండి సింగిల్స్ డే సందర్భంగా ప్రత్యేక షాపింగ్ సీజన్ కి ప్లాన్ చేసింది . పదకొండు రోజులు జరిగే ఈ ఈవెంట్ లో ప్రత్యేకమైన ఆఫర్లు , రాయితీలతో వినియోగ దారులను ఆకర్షిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: