ప్రపంచం లో వింతలకు కొదువేలేదు. ప్రతి నిత్యం ప్రపంచం లో దాగున్న వింతల గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో తెలుసుకుంటూ వుంటాం . కొన్ని మానవులగురించి అయితే మరి కొన్ని ప్రకృతి గురించి ఇంకొన్ని జంతువుల గురించి ఆ వింతలు ఉంది ఉండవచ్చు . అయితే సోషల్ మీడియా లో కొన్ని ఫన్నీ గా మరికొన్ని బయనకమైనవిగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో కి సంబందించిన వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూవుంది. ఈ వీడియో ఓ వ్యక్తి ఓ చేప ను కోసినప్పుడు దాని మాంసం నీలి రంగులో ఉండడం కనిపిస్తూవుంది. ఆ విశేషానికి సంబందించిన వీడియో ని అతడు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలల్లో  ఆ వీడియో కి లైక్ వచ్చిపడ్డాయి. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ గా మారింది.
 

పూర్తి వివరాలలోకి వెళితే అనుభవజ్ఞుడైన ఈటె జాలరి సముద్రం లోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు ఇరుకైన సందులలో ఓ చెప్పాను కునుగొన్నాడు. దాని దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది బండలమధ్య దాగుకొని ఉంది. ఎన్నో ప్రయత్నాలతరువాత అతడు ఆ చెప్పాను తన చిన్న ఈటె తో  పట్టుకున్నాడు. వెంటనే ఆ చేపను బయటకు తీసుకువచ్చి కోసి చూసినప్పుడు అది నీలి వర్ణం లో మాంసాన్ని కలిగివుంది. వెంటనే ఆ ఘటనకు సంబంధించి వీడియో ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.  పోస్ట్ పెట్టిన వెంటనే వేలసంఖ్యలో వీడియో లైక్ లు వచ్చాయి. పలువురు ఆ చేప మాంసం రంగును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోస్ట్ పెట్టిన తరువాత నిముషాల్లో ఈ వీడియోకి 50,000   వీవ్స్  వచ్చాయి.
 

వైరల్ అవుతున్న ఈ చేప గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ చేప ఎందుకు నీలి రంగు లో ఉందొ కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఎలోంగటస్ అనే జాతికి చెందిన హెక్సాగ్రామిడే కుటుంబానికి చెందిన ఈ చేప పేరు లింకోడ్. ఈ లింకోడ్ చేపను వ్యావహారిక భాషలో బఫెలో కాడ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ చేప మాంసం సహజంగా నీలి రంగులో ఉంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: