ప్రస్తత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. అసలే కరోనా, జికా అంటూ అంతు తెలియని వ్యాధులు ప్రబలుతున్నాయి. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు భయంతో తాగే నీటిని కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. జపాన్ లోని ఓ ఆసుపత్రుల్లో మాత్రం గత 30 ఏళ్లుగా మరుగుదొడ్ల నీళ్ళనే మంచి నీళ్లు అనుకుని తాగుతున్నారట. రోగులు మాత్రమే కాదు వైద్యులు సైతం అవే నీళ్లు తాగుతున్నారట.  

జపాన్ ప్రజలు చాలా హాయిగా, క్రమశిక్షణతో జీవించడానికి ఇష్టపడతారు. వారు తమ ఆహారం, పానీయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పరిశుభ్రంగా జీవించడానికి ఇష్టపడతారు.  దాదాపు 30 ఏళ్లుగా ఆయన టాయిలెట్ వాటర్‌ను వినియోగిస్తున్నట్లు ఇటీవలే ఆసుపత్రి ప్రజలకు తెలిసింది. పైపులైన్ తప్పుగా వేశారని ఒసాకా యూనివర్సిటీ ఆస్పత్రి అక్టోబర్ 20న నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ భయంకరమైన నిజం అందరికీ తెలిసింది. ఆసుపత్రి ఆవరణలో కొన్ని చోట్ల తప్పుడు చోట నుంచి తాగునీటి పైపు కనెక్షన్‌ను అమర్చారని తెలిసింది. దానిని విచారించగా దాని పైపు మాత్రమే టాయిలెట్‌కు అనుసంధానించబడిందని తేలింది. దీన్ని అమర్చి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఈ ఆసుపత్రి 1993లోప్రారంభించారు.

ఈ నీటిని ఆస్పత్రిలో ఉన్న ప్రజలు, రోగులు వినియోగించుకునేవారు. ఆ నీటిని తాగడానికి, స్నానానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆసుపత్రిలో ప్రతి వారం నీటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే విచారణలో నీటి సమస్య లేదని యూనివర్సిటీ పేర్కొంది. ఆసుపత్రి డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటాని మాజీ రోగులు మరియు సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆసుపత్రిలో నీటి పైపులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తామని చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: