భార్య‌ల‌ను చిత్ర హింస‌ల‌కు గురిచేసే భ‌ర్త‌లెంద‌రో ఉంటారు. కానీ దేవ‌తలా పూజించే మ‌గాళ్లు కూడ ఉంటారు.  పెండ్లి చేసుకుని త‌నతో  జీవితం పంచుకునేందుకు వ‌చ్చిన మ‌హిళ‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకునే భ‌ర్త‌లు లేక‌పోలేదు. భార్య‌ల‌ను ప్రాణంగా ప్రేమిస్తుంటారు భ‌ర్త‌లు. ఆమె లేక‌పోతే వారి జీవితాన్ని కొంద‌రు అస‌లు ఊహించుకోలేరు. అందుకే భార్య లేని జీవితం దీపం లేని ఇల్లు రెండు ఒక‌టే పేర్కొంటుంటారు.

ఓ భ‌ర్త త‌న‌కు పెళ్లి అయిన‌ప్ప‌టి నుంచి భార్య‌కు తోడుగా, నీడ‌గా ఉంటూ అన్యోన్యంగా వారి జీవించారు. వీరిద్ద‌రికీ ఒక కూతురు కూడ క‌ల‌దు. అంత‌లా ప్రేమించిన భార్య  నిమోనియా బాధ‌ప‌డుతూ కాన‌రాని లోకాల‌కు వెళ్లిపోయింది.  భార్య అకాల మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక పోయిన ఆ భ‌ర్త తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు. ఆమె లేని ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌లేక అల్లాడిపోయాడు.  భౌతికంగా త‌న‌ను విడిచిపోయినా కూడ ఆమె త‌న‌తోనే ఎప్పుడు ఉంటుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. ఈ లోకంలోనే లేని భార్య త‌న ఇంట్లో తన కండ్ల ముందు ఆమె రూపం ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

 ఎంత ఖ‌ర్చు పెట్ట‌యినా స‌రే ఆమె విగ్ర‌హాన్ని త‌యారు చేయించాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యారు. తాను ప‌ట్టిబ‌ట్టి వ‌ద‌ల‌కుండా త‌న భార్య రూపాన్ని పోలిన ఓ విగ్ర‌హాన్ని త‌యారు చేయించాడు. ఆ విగ్ర‌హం స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా ప‌ట్టు చీర‌, న‌గ‌లు ధ‌రింప‌జేసారు. త‌న ఇంట్లో విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి నిత్య పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాల‌క రాష్ట్రం బెళ‌గావి జిల్లాలో వెలుగులోకి వ‌చ్చిన‌ది.

బెళ‌గావిలో నివ‌సించే శివ‌చౌగ‌లే, మైనాభాయ్‌లు భార్య‌భ‌ర్త‌లు. శివ‌చౌగ‌లే కొద్ది కాలం పాటు కార్పొరేష‌న్ లో కూడ ప‌ని చేసారు. ఈయ‌న‌కు క‌రోనా, భార్య‌కు నిమోనియా వ‌చ్చింది. ఒకేసారి ఇద్ద‌రూ అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో భార్య నిమోనియతో బాధ‌ప‌డి మృతి చెందిన‌ది. ఎంతో ప్రేమతో త‌యారు  చేయించిన ఈ విగ్రహాన్ని ఆయన  ఇంట్లోని మొద‌టి అంత‌స్తులో ప్రతిష్ఠించారు. తన భార్య తనను విడిచివెళ్లిపోవ‌డాన్ని త‌ట్టుకోలేకనే ఆమె విగ్ర‌హాన్ని త‌యారు చేయించాన‌ని శివ‌చౌగ‌లే పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: