స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే పాట వింటుంటే ప్రతి ఒక్కరి మనసు పులకరించి పోతూ ఉంటుంది. అంతేకాదు ఎలాంటి కల్మషం లేని స్నేహాన్ని చూస్తూ ఉంటే ప్రతిమనసు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఇలా స్నేహానికి నిదర్శనంగా ఇప్పుడు వరకు ఎంతో మంది వ్యక్తుల స్నేహం ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ ఇలాంటి ఒక స్నేహ బంధమే ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ఎంతో మందిని ఆకర్షిస్తుంది మనుషుల మధ్య స్నేహం కాదు ఏకంగా జంతువుల మధ్య స్నేహబంధం. ఆ రెండు జంతువులు పుట్టుకతోనే శత్రువులు.


 ఈ రెండు ఎక్కడైనా ఎదురుపడ్డాయి అంటే చాలు ఒక రేంజ్ లో పోట్లాడుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం జాతి వైరాన్ని మరచి పోయిన ఈ రెండు జంతువులు స్నేహితులు గా మారిపోయాయి. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ జాలిగా తిరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అయితే కుక్క కోతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే రేంజ్ లో వైరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కుక్క కోతి స్నేహితులుగా మారిపోయి జంతువుల్లో కూడా స్నేహం అంటే లింగభేదం జాతి భేదం ఉంటాయి అని నిరూపించాయి.



 ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. జాతి వైరాన్ని పక్కనపెట్టినా కుక్క కోతి స్నేహం చేయడం మొదలు పెట్టాయి. ఏకంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నట్లుగా వీటి మధ్య స్నేహ బంధం బలపడింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఈ రెండు జంతువులు కలిసి చేస్తున్నాయి. కుక్కపై ఎక్కిన కోతి ఊరంతా తిరుగుతూ ఉంటే ఇక జాతి వైరాన్ని మరచి ఈ రెండు జంతువులు స్నేహంగా ఉండటం చూసి గ్రామస్థులు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోని కొంతమంది సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: