దేశ‌వ్యాప్తంగా టొమాటో ధ‌ర‌లు ద‌డ‌పుట్టిస్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే పెట్రోలు, డిజీల్ ధ‌ర‌లు పరుగులు పెడుతున్నాయ‌ని ఆందోళ‌న చెందిన ప్ర‌జ‌లు.. తాజాగా పెట్రోల్ ను మించిన విధంగా ట‌మాటా ధ‌ర‌లు ప‌రుగులు పెట్ట‌డంతోప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దేశ‌వ్యాప్తంగా  దాదాపు అన్ని రాష్ట్రాల్లో టమాటా సెంచరీ కొట్టింది. ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కిలో ట‌మాటా ఏకంగా 120కి పైగా ఉన్న‌ది. ఈ పంట‌కు అతిపెద్ద కేంద్ర‌ము అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెల‌కొంది. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో కిలో ట‌మాట ధ‌ర రూ.150 వ‌ర‌కు చేరుకుని ఆశ్చ‌ర్యం ప‌రుస్తోంది.
 
గ‌త 20 రోజుల గ్యాప్‌లోనే ట‌మాటొ ధ‌ర ఆకాశాన్ని అంట‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. న‌వంబ‌ర్ నెల ప్రారంభంలో ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో కేజీ రూ.20 నుంచి రూ.40 వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న‌ది. కానీ త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో ఒక్క‌సారిగా ట‌మోటా రేట్లు ఆకాశాన్ని అంటాయి. దేశంలోనే అత్య‌ధికంగా ట‌మాటా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే పండుతుంటుంది. లక్షా 43వేల ఎక‌రాలలో ట‌మాటాసాగు అవుతుంది.

ముఖ్యంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ట‌మాట ఎక్కువ‌గా చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల నుంచి మాత్ర‌మే ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రా అవుతుంటుంది. అయితే ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు చిత్తూరు, అనంత‌పురం జిల్లాల‌లో ట‌మోటా పంట‌ అంత నీట మునిగి తీవ్ర న‌ష్టం క‌లిగించింది రైతుల‌కు. అయితే భారీ వ‌ర్షాల కార‌ణంగా పంట దెబ్బ‌తిన‌డంతో పాటు ధ‌ర‌లు పెరిగాయి. దాదాపు మ‌రో నెల రోజుల పాటు వ‌ర‌కు ట‌మోటా ధ‌ర‌లు త‌గ్గ‌వు అని పేర్కొంటున్నారు వ్యాపారులు. పెరిగిన ధ‌ర‌లు మాత్రం ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌రంగా ఉన్నాయంటూ పేర్కొంటున్నారు. అయితే రైతుల‌కు మాత్రం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయ‌ని ఆశ‌ప‌డుతున్నారు. ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడూ త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని.. ఇప్పుడు ధ‌ర‌లు పెరగ‌డంతో మాత్రం ఆగ‌మేఘాల మీద ధ‌ర‌లు నియంత్రించడానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు రైతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: