ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్ర ప్రజలు కరోనా అనే సంగతి పక్కన పెట్టి పండగను అంగరంగవైభవం గా జరిపారు. మకర సంక్రాంతి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, రాజస్థాన్ సహా దేశంలోని పలు రాష్ట్రాలలొ సంగతి సంబరాలు అంబరాన్ని తాకాయి. గుజరాత్ వంటి రాష్ట్రాలలో గాలి పటాలను ప్రత్యేకంగా ఎగురవెసె ఆచారం ఉంది. అక్కడ ఇది హైలెట్ అవుతుంది. అందుకే సంక్రాంతి సమయంలో ఆ రాష్ట్రాల లో కొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. అందుకే ఆ పండగ ప్రత్యెకంగా చెసుకుంటారు.


అయితే ఈ పండుగ రోజు ఒక కోతి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. కోతి కూడా గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవడాన్ని మీరెప్పుడైనా చూశారా.. కానీ ఇప్పుడు అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు.డాబాపై ఉన్న ట్యాంక్‌పై కోతి కూర్చుని ఉంటుంది. అది అక్కడ మాంజా పట్టుకుని గాలిపటం ఎగురవేయడాన్ని వీడియో లో గమనించ వచ్చు..


ఎవరూ ట్రైనింగ్ ఇచ్చిన విధంగా కోతి చెయ్యడం అందరినీ తెగ ఆకర్షించాయి..గాలిపటాన్ని తనవైపుకు లాక్కుని వానరం గాలిపటాన్ని చింపేస్తూ కనిపిస్తూ సందడి చెస్తుంది. అది చూడగానే అందరూ ఒకింత ఆష్చర్యానికి గురైయ్యారు.గాలిపటాన్ని తనవైపుకు లాక్కుని వానరం గాలిపటాన్ని చింపేస్తూ ఫన్నీగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లొ వైరల్ అవుతన్న ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించారు. చాలా లైక్‌లు, రీట్వీట్లు కూడా వచ్చాయి. ట్విట్టర్‌లో ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను  ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'మకర సంక్రాంతి నాడు జైపూర్‌లో కోతులు కూడా గాలిపటాలు ఎగురవేస్తాయి' అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.మీరు కూడా ఒకసారి చూడండి. కామెంట్లు కూడా చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: