పోలీసులంటే ధైర్య సాహసాలకు మారుపేరు అన్న విషయం తెలిసిందే. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు ఎక్కడ భయపడకుండా పోలీసులు ముందు ఉండి సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధి నిర్వహణ కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి  సిద్ధమవుతూ ఉంటారు. ఇక అటు దేశ సరిహద్దుల్లో సైనికులు ఉన్నారని ఎలాగ అయితే ధైర్యంగా ఉన్నామో.. ఇక ఇప్పుడు క్రైమ్ తగ్గించేందుకు సమస్య వస్తే పరిష్కరించేందుకు పోలీసులు ఉన్నారు అని భరోసాతో ఎంతోమంది హాయిగా నిద్ర పోతూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇలా పోలీసులు అంటే ఎలాంటి సమయంలోనైనా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు ప్రాణాలకు తెగించి పోలీసులు చేసే కొన్ని రకాల పనులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక్కడ పోలీసులు చేసిన ధైర్య సాహసాలు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా నేరానికి పాల్పడితే వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం ఇప్పటివరకు చాలా చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పోలీసులు చిరుతపులి తో పోరాటం సాగించారు.  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలా చిరుతతో పోరాటం సాగించడం గమనార్హం.


 ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. హర్యానా పానిపట్టు లోని బామ్ పూర్ గ్రామంలో కి ఒక చిరుత పులి వచ్చింది. దీంతో ప్రజలు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే చిరుతపులి ప్రజలకు ఎలాంటి హాని కలిగించక ముందే వెంటనే పట్టుకోవాలని భావించి ముగ్గురు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక చిరుతను బంధించే ఆపరేషన్లో భాగంగా చిరుత పోలీసులపై దాడి చేసింది. దీంతో గాయపడ్డ అధికారులు వెంటనే చిరుతను శాంతింపజేశారు. చిరుతను బంధించడం లో  కీలకంగా వ్యవహరించిన పోలీస్ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్  గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: