ఈరోజుల్లో అమ్మాయిలకు వంట గది ఎక్కడుందో అనే విషయం కూడా చాలా మందికి తెలియదు.. టెక్నాలజీ మహిమ.. చదువులు అంటూ చిన్న వయస్సులో ఉంటే.. ఇప్పుడు ఉద్యోగాలు అంటూ తిరుగుథున్నారు. దాంతో వంట గదిలోకి వెళ్ళే అవకాశం రాలేదు. అందుకే 90 శాతం మంది అమ్మాయిలకు తినడం తప్ప వండటం రాదు.. ఇలాంటి అమ్మాయిలకు పెళ్ళయిన తర్వాత చుక్కలు చూపిస్తున్నారు కొందరు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..ఓ ఇంజనీర్ కోడలికి వంట రాదని అత్త తల బాదుకుంటూ వస్తుంది.. చూడటానికి చాలా ఫన్నిగా ఉండటం తో అందరు నవ్వుకున్నారు.


ఉద్యోగం చేసే మహిళలకు అయితే వంట గదిలోకి వెళ్లడానికి సమయమే ఉండడం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌లకు. కొందరికి అయితే వంట చేయడం కూడా రాదు. దాంతో పెళ్లయిన తర్వాత అత్తారింట్లో అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. తాజాగా కొత్తగా పెళ్లయిన ఓ ఇంజనీర్ కోడలు పడే వంట కష్టాలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..కోడలిని వంట చేయమని అత్తగారు అడుగుతుంది. ఇంజనీర్ అయిన ఆమెకు వంట చేయడంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. దాంతో కోడలు తన అత్తగారి సూచనలతో రోటీలు చేస్తుంది. ఇక కోడలు పేనం మీద రోటీ కాల్చుతుండగా.. అలా కాదు కాల్చేది అని అత్త అంటుంది. చేతితో రోటీని తిప్పు అంటుంది. రోటీ మాడిపోతుంది తిప్పివేయి అని అత్తగారు అనగానే ఏకంగా పెనాన్ని తిప్పి వేస్తుంది.

 

అది కాస్త స్టవ్ మీద పడుతుంది.కోడలు వంట చేసే తీరు చూసి అత్తగారు తల పట్టుకున్నారు. ఇలా చేశావ్ ఏంటి అని కోడలు తలపై ఒక్కటిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అత్తా, కోడలి వంట డ్రామాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 5 లక్షల లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అంటారు..అమ్మాయికి అన్నీ ఉండాలి అని.. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని. అందుకే అమ్మాయిలు జర జాగ్రత్త చిన్నచిన్నవి నేర్చుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: