ప్రతి మనిషికి కూడా సొంతిళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆ ఇంటి కోసం చాలా మంది చాలా ఏళ్లుగా కలలు కంటుంటారు. ఆ కల సాకారం చేసుకున్నప్పుడు వారు అనుభవించే సంతోషం అయితే మామూలుగా ఉండదు..అయితే, కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకున్నా, లేదంటే, కట్టుకోవాలనుకున్నా మాత్రం చాలా విషయాలపై దృష్టి పెడతారు.మరీ ముఖ్యంగా వాస్తును చాలా మంది కూడా తప్పక పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి, బెడ్‌రూం, డైనింగ్‌ టేబుల్‌, వంటగది ఇంకా బాత్‌రూం సరైన ప్రాంతంలో ఉండేలా చూసుకుంటారు. అన్ని సక్రమంగా ఇంకా తమకు నచ్చిన విధంగా ఉంటేనే ఆ ఇంటిని నివాసయోగ్యంగా ఎంచుకుంటారు..కానీ, ఇక్కడ ఓ ఇంటికి సంబంధించిన ఓ ఫోటో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు అంతా కూడా అసలు ఇదేక్కడి విడ్డూరంరా బాబు అనుకుంటూ షాకింగ్‌ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంతకీ ఆ ఫోటో వెనకాల గల అసలు సంగతి ఏంటంటే…సోషల్‌ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తున్న ఈ ఫోటోకు సంబంధించిన ఇల్లు మన దేశంలోనిది కాదట…అమెరికా దేశంలోని పెన్సిల్వేనియాకు చెందినదిగా తెలిసింది.ఇక యూఎస్ లోని ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఈ ఇంటి ఖరీదు వచ్చేసి 420000 డాలర్లుగా పేర్కొన్నాడు. అంటే మన డబ్బులో సుమారుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది. అయితే..ఆ ఇంటి నిర్మాణం మాత్రం దెబ్బకు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ కూడా అందులో టాయిలెట్ ఉన్న స్థలాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఏకంగా మెట్లపై కింద కార్పెట్ తో సహా ఉన్న ఈ టాయిలెట్ ను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు.కోట్ల ఇంటికి టాయిలెట్ తో స్వాగతం అంటూ చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎంట్రీ లోనే ఇన్ని వింతలు కనిపిస్తే.. ఇంట్లో ఇంకెన్ని వింతలు ఉన్నాయో అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి నడి ఇంట్లోనే దర్శనమిస్తున్న ఈ టాయిలెట్‌ మాత్రం నెటిజన్లకు మాత్రం అంతుచిక్కని ఓ మిస్టరీగా తయారైంది. కామెంట్లు, షేర్లతో సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతూ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: