వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ.. ఈ పేరు వినగానే ఫోటోగ్రాఫర్లు  చేసే రిస్కు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. పెళ్లిళ్లలో ఫంక్షన్లలో ఫోటోలు తీయడం ఎంతో సులభం. కానీ అదే ఏకంగా పెద్ద అడవిలోకి వెళ్లి ఒకవైపు క్రూరమృగాలు జంతువులను వేటాడుతూ ఉంటే.. ఇక దాని పక్కనే ఉండి ఫోటో తీయడం ఇక ప్రాణాలను రిస్క్ లో పెట్టడం అవుతుంది అని చెప్పాలి. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది వైల్డ్ లైఫ్  ఫోటోగ్రాఫర్ లు అడవుల్లో ప్రమాదపు అంచుల్లో నిలబడి ఫోటోలు తీసి ఇక ఎంతో మందికి ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు తీసే వీడియోలు ఫోటోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. క్రూర మృగాలు   పక్కనుంచి వెళ్తున్నా భయం బెరుకు లేకుండా ఫోటోలు వీడియోలు తీస్తారు. ఇలాంటివి చూసినపుడు వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 ఇంతకీ ఈ వీడియో లో ఏముందంటే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కారు ముందు భాగం లో కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తూ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అంతలో ఒక పక్కనుంచి భారీ సింహం వచ్చింది. అతడిని కోపంగా చూస్తూ అక్కడే నిలబడింది. అయితే సింహాన్ని ముందుగా సదరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గమనించలేదు. కానీ గమనించిన తర్వాత ఒక్కసారిగా వణికిపోయాడు. కానీ ఎంతో చాకచక్యంగా సింహం నుంచి తప్పించుకున్నాడు అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత ప్రతి ఒకరు నో కామెంట్ అంటూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: