ఇక మహా అయితే ఒక ఆటోలో ఎంత మంది కూర్చుంటారు ? సాధారణంగా రూల్ ప్రకారం అయితే డ్రైవర్ తో కలిపి ముగ్గురే కూర్చోవాలి.అయితే ప్రతి ఆటోలో కూడా నలుగురు నుంచి ఆరుగురు కూర్చుంటారు. కానీ ఇక్కడ ఓ ఆటోలో ఉన్న ప్రయాణికులను చూసి దెబ్బకు పోలీసులే పెద్ద షాక్ అయ్యారు.ఇక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫతేపూర్‌లో ఈ ఘటన అనేది చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి అక్కడ ఓ ఆటోరిక్షాను ఆపారు. ఇక అందులో డ్రైవర్ తనతో పాటు మరో 27 మంది ప్రయాణికులను కూడా తీసుకెళ్తున్న విధానాన్ని చూసి దెబ్బకు అతను ఖంగుతిన్నాడు. ఇది ఆటోనా లేకపోతే లారీనా అని అతను దెబ్బకు పరేశాన్ అయ్యాడు. ఆ ఆటో నుంచి ప్రయాణికులను దించుతూ వారి సంఖ్యను కూడా ఒక్కొక్కరిగా లెక్కిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారింది.ఇక సాధారణంగా ఆటోరిక్షాలో మొత్తం ఆరుగురు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. కానీ ఈ ఆటోలో పిల్లలు ఇంకా అలాగే వృద్దులు కలిసి ఏకంగా 27 మంది (డ్రైవర్ కాకుండా) కూర్చొని ఉన్నారు.


ఆ ఆటోను ఆపినప్పుడు వారంతా కూడా ఆటోలో బాగా ఇరుక్కుపోయి కనినించారు.ఇక పోలీసులు ఆ ఆటోలో నుంచి ఒక్కొక్కరిని కిందకు దించి ఆ పక్కన నెలబెట్టి లెక్కపెడుతున్నప్పుడు ఆ దారిలో వెళ్లే ఒక వ్యక్తి ఈ తతంగం మొత్తాన్ని కూడా చూసి వీడియో తీసి దెబ్బకి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇంకా ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఆ ఆటో చాలా వేగంగా వెళ్తుండటంతో అక్కడే ఉన్న పోలీసు స్పీడ్ గన్ తో దానిని చెక్ చేశారు. తరువాత ఇక ఆ వాహనాన్ని పోలీసులు వెంబడించడం జరిగింది.అనంతరం దానిని నిలిపివేసి ఆ ప్రయాణికులను కిందకి దిగాలని కోరారు. అందులో నుంచి అంత మంది బయటకు రావడం చూసి అక్కడి పోలీసులు కూడా బాగా ఆశ్చర్యపోయారు.అనంతరం ఆ ఆటోను వారు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: