ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది ఎక్కడైనా ఒకేలాగే ఉంటుంది. ఇక జంతువుల్లో కూడా అమ్మ ప్రేమ మారాదు.మనుషులతో పోల్చుకుంటే జంతువులు తమ పిల్లలనుఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ ఉంటాయి.ఇక తల్లి ప్రేమ కు అద్దం పట్టే వైరల్ వీడియోలు అనేవి సోషల్ మీడియాలో కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. ఇంకా తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో ఒక కోతి తన పిల్ల కోసం పడే తపన చూస్తే హృదయం ద్రవించక మానదు. మాములుగా పిల్లలు చేతికి ఏది దొరికితే అది వారు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అయితే అది గొంతులోకి వెళ్లి వారు బాగా ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇక అది చాలా ప్రమాదం.. తల్లి దండ్రులు అది గమనించకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. తాజాగా ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతిపిల్ల ఎదో మింగేసింది.. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే..పిల్ల కోతికి గొంతులో ఇరుక్కోవడంతో అది బాగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అది గమనించిన తల్లి కోతి తన బిడ్డను దగ్గరకు తీసుకొని హేమ్లిచ్ చేసింది. 


ఈ హేమ్లిచ్ అనేది శ్వాసనాళం నుండి అడ్డంకిని తొలగించడానికి ఒక ప్రథమ చికిత్స ప్రక్రియ. కోతి పిల్ల ను వెనకనుంచి అది గట్టిగా పట్టుకొని పైకి కిందికి ఊపింది. ఇక ఆ తల్లి కోతి అలా కొద్దిసేపు ఊపిన తర్వాత ఆ పిల్లకోతి గొంతులో ఇరుక్కున్నది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఆ పిల్ల కోతిని తల్లికోతి కాపాడుకున్న విధానం నెటిజనుల హృదయాలను ఎంతగానో గెలుచుకుంటుంది. ఇక వైరల్ అయిన ఈ వీడియో అందరినీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ కోతి చాలా తెలివైనదనికామెంట్లు నెటిజన్స్ పెడుతున్నారు నెటిజన్లు.ఫిగెన్ పేరుతో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోమొత్తం 2 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసి దీనిపై కామెంట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: