సాధారణంగా సినిమాలలో చేజింగ్  సీన్లు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి చేజింగ్  చేస్తున్న సమయంలో ఏం జరుగుతుందా అని అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా కన్నార్పకుండా సినిమా చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే సినిమాల్లో ఇరుకు ఇరుకు రోడ్ల మధ్య వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా వెళుతూ చేజింగ్ చేస్తూ ఉండడం చూసిన తర్వాత ఇలాంటివి నిజజీవితంలో జరగడం మాత్రం దాదాపు అసాధ్యం అని చెబుతూ ఉంటారు అందరూ. కానీ రియల్ లైఫ్ లో కూడా పోలీసులు ఇలా ఛేజింగ్  చేస్తారు అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 వెనక నుంచి పోలీసులు కారులో వెంబడిస్తూ ఉంటే రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకు దూసుకెళ్తున్నారు నేరస్థులు. అయితే ఒకానొక సమయంలో అటు పోలీసులు కిందకు దిగి కారులో ఉన్న నేరస్తుల పై కాల్పులు జరిగినప్పటికీ కారు మాత్రం ఆగకుండా ముందుకు దూసుకు వెళుతూనే ఉంది అని చెప్పాలి. అయితే ఇదంతా చూసిన వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా ఏంటి అని అని ఒక్కసారిగా  ఆలోచనలో పడిపోయారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఈ అద్భుతమైన చేజింగ్ కు  సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వైరల్ గా మారిపోయాయ్. మారుతి సుజుకి డిజైర్ కార్ లో ఇద్దరు వ్యక్తులు హెరాయిన్ తీసుకొని వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కారులోని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిని వెంబడించారు పోలీసులు. కాగా నేరస్తులు వెళ్తున్న కారు ఒక మహిళకు తాగి ఆమె  కిందపడిపోయింది. అయినప్పటికీ అడగకుండా వెళ్ళిపోయారు. అయితే వెనకాల ఉన్న పోలీసులు తుపాకీతో కార్ టైర్ పై కాల్పులు జరిపారు. అయినప్పటికీ మరికొంత దూరం పాటు కారులో ఆగకుండా ముందుకు వెళ్లారు. అయితే ఎట్టకేలకు 10 కిలోమీటర్లు చేసింగ్  తర్వాత నేరస్థులను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: