సాధారణంగా పశువులు లాంటి మూగజీవాలు ఎప్పుడు ప్రశాంతంగానే  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రశాంతం గా ఉన్నాయి కదా అని వాటి దగ్గరికి వెళ్లి వెకిలి చేష్టలు చేస్తే మాత్రం వాటికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దీంతో వాటి ప్రతాపమంతా చూపిస్తూ వుంటాయి. ఇప్పుడు వరకు ఎంతోమంది ఏకంగా పశువుల దాడిలో గాయపడిన వారు ఉన్నారు అనే చెప్పాలి. ప్రశాంత స్వభావం కలిగిన పశువులను రెచ్చగొట్టి మరీ చివరికి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న వారు ఉన్నారు. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రశాంత స్వభావం కలిగిన పశువుల ముందు ఏదైనా వెకిలి చేష్టలు చేస్తే అవి ఎలా దాడిచేస్తాయి  అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటనే నిదర్శనం గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వనుకు పుడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ప్రశాంతంగా నిలబడిన ఎద్దు ముందు వెకిలి చేష్టలు చేశాడు. దీంతో దానికి చిర్రెత్తుకొచ్చింది. కాసేపటి వరకూ చూస్తూ ఊరుకుంది ఎద్దు. ఆ తరువాత అతనికి సరైన గుణపాఠం చెప్పింది. ఏకంగా అతన్ని వెంబడించి దాడిచేసి కొమ్ములతో పైకెత్తి గాల్లోకి లేపి పడేసింది. ఈ వీడియో కాస్త ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది.


 ఈ వీడియో లో భాగంగా ఒక ఉత్సవం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఖాళీ ప్రదేశంలో ఎద్దు కొమ్ములకు నిప్పుపెట్టి వదిలేసారు. చుట్టూ భారీ సంఖ్యలో జనాలు ఉన్నారు. అయినప్పటికీ ఆ ఎద్దు  ప్రశాంతంగానే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆ ఎద్దు ముందుకు  వచ్చిన ఒక వ్యక్తి తన మాటలు చేతలతో ఎద్దును  రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అది కోపంతో ఊగిపోయింది. వెంటనే అతని వెంట పరిగెత్తింది. అయితే ముందు స్టెప్స్ ఎక్కి  పారిపోయేందుకు ప్రయత్నించగా అతన్ని వదలలేదు. కొమ్ములతో గాల్లోకి లేపింది. దీంతో మెట్ల పైనుంచి కింద పడిపోయి స్పృహ తప్పి పోయాడు సదరు వ్యక్తి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: