సాధారణంగా విషపూరితమైన నాగుపాములను చూసినప్పుడు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  నేరుగా నాగుపామును చూడడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ ఇక ఏదైనా వీడియో సోషల్ మీడియాలో నాగుపాము ప్రత్యక్షమైందంటే చాలు కళ్ళు కాస్త పెద్దవి చేసుకొని మరి వీడియోని వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నాగుపాముని చూస్తే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఎంతో చాకచక్యంగా నాగుపాములను పట్టుకోవడం లాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే పడగవిప్పి బుస కొట్టే ప్రతి నాగుపాముకు కూడా నాగమణి ఉంటుంది అని ఎంతగానో ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది ఇది ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా నాగుపామును పట్టుకొని దాని తల భాగంలో ఉండే నాగమణిని బయటకు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియోలో భాగంగా నాగుపామును పట్టుకున్న ఒక వ్యక్తి ఏకంగా దాని తల భాగం నుంచి చిన్న సైజు రత్నాన్ని బయటకు తీసాడు.


 ముందుగా పొలాల మధ్య ఉన్న ఒక మట్టి రోడ్డులో నాగుపాము ఉంటుంది. అయితే దాన్ని ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్ తో కంట్రోల్ చేస్తాడు. ఇలాంటి సమయంలోనే అతన్ని చూసి పడగవిపి బుసలు కొడుకు వెనకాలకు వెళుతూ ఉంటుంది నాగుపాము. ఇక రోడ్డు దాటి పొలాల్లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. సదురు వ్యక్తి పాము తోకను పట్టుకొని మళ్ళీ రోడ్డుపైకి లాక్కొని వస్తాడు. దీంతో నాగుపాము అతని కాటు వేసేందుకు ప్రయత్నించుగా తెలివిగా తప్పించుకుంటాడు. తర్వాత నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకొని తలపై చాకుతో కోస్తాడు. దీంతో చిన్న సైజు రత్నం బయటికి వస్తుంది. తర్వాత  పామును వదిలేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు నాగమణి అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: