సాధారణంగా ఎంతోమంది పాము పేరు చెబితే చాలు భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడైనా పాము ఉంది అన్న విషయం తెలిసిందంటే చాలు అటువైపు వెళ్లడాన్ని కూడా మానుకుంటూ ఉంటారు. పాము దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా పెద్దగా సాహసం చేయరు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం పాముల విషయంలో కాస్తయినా భయం బెరుకూ లేకుండా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏకంగా పాములను రక్షించడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం భయపడకుండా తెలివిగా పాములను హ్యాండిల్ చేస్తూ ఉంటారు.


 ఇక్కడ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా రహదారులపై వాహనాలు వెళుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు పాములు రోడ్డుమీదికి రావడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా రోడ్డుపై ఒక భారీ పాము కనిపించినప్పుడు ఎవరైనా సరే పామును పట్టించుకోకుండా అలాగే వాహనాలు పోనిస్తూ ఉంటారు.  ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పాము ప్రాణాలు పోకుండా కాపాడాడు. రాత్రి సమయంలో వాహనాలు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక భారీ పాము రోడ్డు దాటుతూన్నట్లు కనిపించింది.


 ఈ క్రమంలోనే వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా తమ వాహనాలను ఆపేశారు. ఇక ఆ పెద్ద పాము రోడ్డు దాటిన తర్వాత వాహనాలు ముందుకు పోనియ్యాలి అనుకున్నారు. ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు అని చెప్పాలి. అందరూ పామును చూసి దూరం నుంచే భయపడుతూ ఉంటే.. సదరు వ్యక్తి మాత్రం చిమ్మ చీకట్లో ఫోన్ టార్చ్ పెట్టుకుని పాము దగ్గరికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడున్న వారందరూ కూడా వద్దు వద్దు అని వారిస్తున్న వినలేదు. చివరికి పాము తల ఎటువైపు ఉందో చూసి ఆ తలను పట్టుకొని భారీ పామును ఇక రోడ్డు పక్కకు జరిపాడు. దీంతో అది పొదల్లోకి వెళ్లిపోయింది. ఇక ఇది చూసిన అక్కడున్నవారు అతని ధైర్యానికి ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: