సాధారణంగా ఎంతో అద్భుతంగా డాన్స్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది   కానీ కొంతమంది డాన్స్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. తమకు డాన్స్ రాదని ఫీలవుతూ ఉంటారు. అయితే డాన్స్ నేర్చుకోవాలనే కోరిక వారిలో ఉన్నప్పటికీ డాన్స్ నేర్చుకోవడం మాత్రం ఎంతో కష్టమని భావిస్తూ ఉంటారూ అని చెప్పాలి.  ముఖ్యంగా మైకేల్ జాక్సన్ ఇక డాన్స్ ప్రపంచంలోకి ఎన్నో సరికొత్త స్టెప్పులను తీసుకువచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి స్టెప్పులలో బాగా పాపులర్ అయింది మూన్ వాక్. ఎవరైనా ప్రొఫెషనల్ మూన్ వాక్ చేస్తున్నారు అంటే చాలు ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది.


 ఎంతోమంది మైకేల్ జాక్సన్ లాగా మూన్ వాక్ చేస్తూ ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు   అయితే ఇలా సోషల్ మీడియాలో చూసి ఆనంద పడటమే కాదు మూన్ వాక్ చేయాలి అని ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వారు సులభంగా నేర్చుకునేందుకు ఎంతోమంది సోషల్ మీడియాలో మూన్ వాక్ టీచింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ట్విట్టర్ వేదికగా విస్తృతంగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే ఒక యువతి ముందుగా షూస్ వేసుకొని ఒక రోడ్డుపై నిలబడి ఉంటుంది. ఆ తర్వాత ఆమె మూన్ వాక్ చేసేందుకు ముందుగా కాళ్లను ఏ పొజిషన్లో పెట్టాలో చూపిస్తుంది. ఆ తర్వాత మూన్ వాక్ చేస్తూ వెనక్కి వెళ్తుంది. అప్పటివరకు ఆమెతో సంబంధం లేనట్లు కనిపించిన కొంతమంది యువకులు ఆమె మూన్ వాక్ చేస్తూ ఉంటే ఆమెతో కలిసి స్టెప్పులు చేయడం మొదలుపెట్టారు. ఇక ఇది చూసిన నెటిజన్లు అందరూ మంత్రముక్తులు అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: