కింగ్ కోబ్రా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అతి ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా కూడా ఒకటి ఇక ఒక్కసారి కింగ్ కోబ్రా కాటుకు గురయ్యారు అంటే వారు ప్రాణాలతో బయటపడటం చాలా అరుదు అని చెప్పాలి.  కేవలం నిమిషాల వ్యవధిలోనే విషం రక్తంలో కలిసిపోయి శరీరమంతా పాకి చివరికి వ్యక్తి చనిపోతూ ఉంటాడు.  అయితే కింగ్ కోబ్రా కేవలం విషం ప్రమాదకరమైనది మాత్రమే కాదు ఇక దీని రూపం కూడా ఎంతో భయంకరంగానే ఉంటుంది. సాధారణ నాగుపాములతో పోల్చి చూస్తే కింగ్ కోబ్రా చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పాలి.


 అయితే కింగ్ కోబ్రా ఎంతో వేగంగా కదులుతుంది అన్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతోమంది చూసి ఉంటారు. అలాంటి ప్రమాదకరమైన పామును పట్టుకోవడంలో అటు స్నేక్ క్యాచర్లు కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. తమకి తాము రక్షణ కల్పించుకుంటూనే ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు చూసినప్పుడు కింగ్ కోబ్రా తో సాహసాలు చేయడం అంటే నిజంగా వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 సాధారణంగా స్నేక్ క్యాచర్లు ఒక కర్ర సహాయంతో ఇక పాములను పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఎలాంటి సపోర్టు లేకుండానే ఎంతో అలవోకగా ఒక భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. ఈ క్రమంలోనే దానిని పట్టుకునేందుకు యువకుడు వస్తాడు. అయితే అతను ఎంతో తెలివిగా పామును కంట్రోల్ చేస్తాడు. కింగ్ కోబ్రా ఇక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతుంటే తోకను పట్టుకొని లాగుతాడు. దీంతో విష సర్పం కోపంతో బుసలు కొట్టు మీది మీదికి వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు యువకుడు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: