ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో కుక్కలను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. అవి చాలా విశ్వాసంగా ఉండే జంతువులు. ఇంకా అంతేకాకుండా చాలామంది కూడా కుక్కలను వారి ఇంట్లో వ్యక్తి లాగా భావించి వారు ఎక్కడికి వెళ్తే అక్కడకు కుక్కను వారి వెంట తీసుకుపోవడం లాంటివి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది మూగ జీవాల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వాటిని హింసిస్తూ ఉంటారు.తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఉత్తరప్రదేశ్ లోని భరత్ కౌబాలి ప్రాంతంలో ఒక వ్యక్తి కుక్క వెనుక భాగము రెండు కాళ్ళను పట్టుకొని రోడ్డుకేసి చాలా బలంగా కొట్టడం దాన్ని తిప్పడం మనం చూడవచ్చు.ఆ వ్యక్తి ఆ కుక్కను దాని వెనుక కాళ్ళను అలాగే పట్టుకొని ఆ కుక్కను గుండ్రంగా తిప్పుతూ రోడ్డుపై బాదడం మనం వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.


 ఈ క్రమంలో చుట్టుపక్కన ఉన్న కుక్కలు కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టాయి.అయినా.. కానీ., ఆ వ్యక్తి ఎలాంటి బెదురుకు గురవ్వకుండా రాక్షసుడులా ప్రవర్తించాడు. ఇక ఆ కుక్కలు ఎంత అరిచినా కూడా ఆ వ్యక్తి ఆ కుక్కను నేలకేసి బాధడం మానలేదు. ఇక మిగిలిన కుక్కలు అక్కడి నుంచి పరుగులు తీయడం మనం వైరల్ అవుతున్న ఈ వీడియోలో గమనించవచ్చు.ఇక వైరల్ అవుతున్న వీడియోని చూసి కొంతమంది నెటిజన్స్ మూగజీవులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకా అంతేకాకుండా ఖచ్చితంగా ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత స్థానిక పోలీసులను వారిని కోరడం జరిగింది. ఇక మరి కొంతమంది నెటిజన్స్ అయితే చుట్టుపక్కన ఉన్న వారైనా ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.. ఆ కుక్కని హింసించిన వాడికి ఖచ్చితంగా కఠిన శిక్ష వెయ్యాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: