ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువగా చాలామంది భర్త లేదా అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారని దీంతో తన భర్తతో కాపురం చేయనీయడం లేదనే భార్యలు సైతం బంధువులు ధర్నా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తోంది. అదేమిటంటే తమ భార్యలను కాపురానికి పంపించాలి అంటూ బర్తలే ధర్నా చేయడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయం ఏకంగా జిల్లా ఎస్పీ కలెక్టర్ దృష్టికి వెళ్లడం కూడా మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏలూరు ప్రాంతానికి చెందిన బూరుగుడ్డ శ్రీనివాస్ కు ఇద్దరు కుమార్తెలు కలరు.. ఈ క్రమంలోనే పెద్ద కుమార్తెను పవన్ అనే వ్యక్తికి ఇచ్చి మరి పెళ్ళి చేశారు.. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించిందట. వివాహమైన రెండేళ్లకే తన కూతురును రామానుజ తన ఇంటికి తీసుకువెళ్లారని ఆరోపించారు. అప్పటినుంచి ఆమె అసలు కాపురానికే రాలేదని ఆ బాధితులు తెలియజేస్తున్నారు. రామానుజ అయ్యంగారు తన రెండవ కుమార్తెను కూడా శేషసాయి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా వివాహం చేశారు. ఆమెను కూడా కొన్ని కారణాల చేత వివాహమైన నెల రోజులకే రామానుజ తన ఇంటికి తీసుకువచ్చారని మరొక అల్లుడు తెలియజేస్తున్నారు. ఇలా ఇద్దరు కుమార్తెలను కూడా అప్పటినుంచి తన ఇంట్లోనే పెట్టేసుకున్నారు ఆ తండ్రి. దీంతో ఇద్దరు అల్లుళ్ళు తమ భార్యలను పంపించాలంటు ఎన్నోసార్లు అడిగినప్పటికీ అసలు పలకడం లేదట. ఈ క్రమంలోనే అల్లుళ్ళు ఇద్దరు తమ కుమార్తెలను వేధిస్తున్నారనే విషయం పైన తప్పుడు కేసు పెట్టించారట.. దీంతో ఈ విషయం తెలుసుకున్న అల్లుళ్ల సైతం తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ తమ మామ పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్, శేష సాయి ఏకంగా ఏలూరు జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే ఒక ఫ్లెక్సీ ని పట్టుకొని మరి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లగా మరి ఆయన ఏవిధంగా  ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: