అసలు విషయంలోకి వెళితే ఫ్లైఓవర్ మీద ఈ జంట కదులుతున్న బైక్ ని నడుపుతూ ఇద్దరు కూడ ముద్దులు పెట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఆ అమ్మాయి తల దాచుకొని మరి ముద్దులు పెడుతూ ఉండగా..ఇద్దరు కూడా తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి ఏ విధంగా పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వెళ్లడంతో.. రోడ్డుమీద ప్రయాణిస్తున్న వారికి ప్రమాదాలు జరుగుతాయని ఈ జంట పైన ఫైర్ అవుతున్నారు.. ముఖ్యంగా చట్టం పట్ల భయము లేవని భద్రత పట్ల కూడా చాలా అశ్రద్ధ చూపుతున్నారు ఈ జంట పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
బైక్ పై ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఈ జంట కు సంబంధించి ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది తిట్టిపోస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తమ జీవితాలను ఇలా ప్రమాదంలోకి పడేసుకుంటున్నారని అలాగే అధికారులు కూడ ఇలాంటివి యువత చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలంటు పలువురి నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలు కూడ గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారడంతో అధికారులు కూడా అలాంటి వారి పైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా యువతి యువకులు మారకుండా ఇలాంటి పాడు పనులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.