మన మెదడు చురుగ్గా ఉన్నప్పుడే మన ఆలోచనలు కూడా మెరుగ్గా ఉంటాయి. అపుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ఆలోచనలు మనకు సహాయపడతాయి. మన శరీరంలో ప్రతి అవయవాన్ని మన మెదడే నియంత్రిస్తుంది. ముఖ్యంగా మన మెదడు షార్ప్ గా ఉంటేనే మన ఆలోచనలు కూడా ఉత్తమంగా ఉంటాయి.
శరీరం ఒక ఆధునిక యంత్రం అని చెప్పొచ్చు. శరీరంలోని అన్ని అవయవాల విధులు ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మన బ్రెయిన్ అనేది ఒక పవర్‌హౌస్ లా పనిచేస్తుంది. పూర్తి శరీరమే మెదడు ఆధీనంలో ఉన్నప్పుడు మన లక్ష్యం దాని గమ్యం కూడా మన మెదడు పైనే ఆధారపడి ఉంటుందన్నది తెలిసిందే.

అలాంటి  మెదడు చురుగ్గా ఉండి మన విజయానికి మార్గం చూపాలి అంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి.  ఈ పదార్దాలు తినడం వలన మెదడు ఆరోగ్యంగా చురుగ్గా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.

* ఆకు పచ్చని కూరగాయలు మెదడుకు బాగా మేలు చేస్తాయి. కూరగాయలతో చేసిన సలాడ్స్, ముఖ్యంగా ఉడికిచ్చినవి మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఆకుకూరలు మెదడుకే కాదు అన్ని విధాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు ఆకు కూరలను చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. ఆకుకూరలు ఎక్కువగా తినడం వలన కళ్ళ రక్షణకు ఎంతో అవసరమైన విటమిన్ A కూడా లభిస్తుంది.

* డార్క్ చాక్లెట్ మెదడు మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల  మెదడులోని భాగాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరగడమే కాకుండా మన మనస్సు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. జ్ఞాపక శక్తి కూడా చక్కగా పెరుగుతుంది.

* బ్లూబెర్రీస్ మెదడును సంరక్షించడంలో ప్రధమ పాత్ర వహిస్తాయి. మెదడులో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేందుకు సహాయపడతాయి. బ్లూ బెర్రీస్ శరీరానికి కూడా మంచి శక్తిని ఇస్తాయి.

* బాదం పప్పు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కు బాగా సహాయపడుతుందట.

కాబట్టి పై విషయాలను బాగా అర్ధం చేసుకుని అనుసరిస్తే మీ మెదడు చురుగ్గా ఉంటుంది. తద్వారా మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: