విజయం అందరికీ నచ్చే పదం, అందరూ కోరుకునే వరం. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుకున్న ఆశయాన్ని సాధించి విజయాన్ని తమ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ విజయాన్ని పొందటం ఎంత ముఖ్యమో ఆ విజయాన్ని కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. ఆ సూత్రాలే మిమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తాయి. మీ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుతాయి. ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. దృష్టిని మరల్చే అలవాట్లను అదుపులో ఉంచాలి. అంటే మన లక్ష్యం నుండి, మన పని నుండి దృష్టిని మరలిచే పనులకు మనం దూరంగా ఉండాలి.  

టెక్నాలజీ: ఈ కాలంలో టెక్నాలజీ ఎలా పరుగులు తీస్తుందో మనము చూస్తున్నాము. అయితే ఈ సాంకేతికతను మనము మరియు మన తరము భవిష్యత్తుకు ఉపయోగపడే పనులను చేయడం మంచిది. అలా కాకుండా నేటి రోజుల్లో టెక్నాలజీ ని ఎన్నో నష్టాలకు వాడుతున్నారు.  ఏదైనా సరే అవసరానికి మించి వాడడం మంచిది కాదు. మేధావులు ఎప్పుడు పని చేసే సమయంలో వారి ఫోన్లను సైలెంట్ మోడ్ లో ఉంచుతారు. సాంకేతికత విషయంలో ఎపుడు క్రమశిక్షణగా ఉంటారు.

ప్రణాళిక: ప్రణాళిక అనేది  ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రణాళిక బద్దంగా ఉండే జీవితం ఎపుడు కూడా సంతోషంగా ఉంటుంది. ప్రణాళిక అనేది లేకపోతే అలవాటు చేసుకోక పోతే అనుకున్నది సాధించడం...అలాగే సాధించినది నిలుపుకోవడం రెండూ కష్టమే.

నేర్చుకోవడం: మనిషి ఎపుడు నిరంతర విద్యార్దే. అనుకున్నది సాధించాలంటే ఎన్నో నేర్చుకోవాల్సి వుంటుంది. చాలా అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఎంత నేర్చుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఒకటి రెండు విజయాలు సాధించినంత మాత్రాన అన్ని మనకు తెలుసు  అనుకుంటే పొరపాటే.

కాబట్టి పైన మీకు తెలిపిన ఈ విషయాలను అర్ధం చేసుకుని పాటిస్తే విజయం మీ ఇంటి అతిధి అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: