ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని వనరులను సమకూర్చుకుని సంతోషంగా జీవించాలంటే మనము అనుకున్న రంగంలో విజయం సాధించాలంటే ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. అయితే విజయం సాధించడం ఎంత కష్టమో ఆ విజయాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం అంతకు మించి కష్టం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎంత తెలివైన వారైనా, ఎంత మేధస్సు ఉన్నా కొన్ని చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందరూ ఎన్నో కష్టాలు పడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఒక పెద్ద స్థాయికి చేరుకున్నప్పుడు అంతకు ముందు పడిన కష్టాలు మరిచిపోతారు.

ఇప్పుడు మనం కోరుకున్న ఉన్నత స్థాయిలో నిలబడి ఉన్నాం ఇక దిగులెందుకు, అలాగే అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఏముంది..?? అంటూ చాలా నిర్లక్ష్యం చూపుతారు. కానీ ఆ నిర్లక్ష్యమే సమయం కలసి రాకపోతే మిమ్మల్ని మళ్ళీ అట్టడుగు స్థాయికి దిగేలా చేస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నది సాధించడం కాదు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కూడా తెలిసుండాలి అన్నారు పెద్దలు. అది అక్షరాల నిజం. కానీ మన నిర్లక్ష్యం పలు సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. అందువలన విజయం అందుకున్నాక ఆ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. కానీ ఆ ఆనందంతో పూర్తిగా రిలాక్స్ అయి పోకూడదు.

అదే మన పతనానికి నాంది పలుకుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. అపుడే మన గౌరవం మనకి దక్కుతుంది. విజయం సొంతమైన ఆనందంలో అన్నిటినీ పక్కన పెట్టి విజయ గర్వంతో విర్రవీగితే ఆ విజయానికి విలువ లేకుండా పోతుంది. అంటే ఈ విధంగా అందరూ చేస్తారు అని కాదు. ఎక్కువ మంది ఇదే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మీ జీవితానికి మంచిది.  నష్టం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ముందే మేల్కొనడం వలన అంతా సంతోషంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: