జీవితంలో ప్రతి ఒక్క మనిషికి గెలుపు అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. కొన్ని సార్లు ఆ గెలుపు మన స్వయం కృత అపరాధం వలన దూరం అవుతూ ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన విజయాన్ని దూరం చేసి అందరి ముందు లూజర్ గా నిలబెడతాయి. అందుకే విజయం కోసం ఎంత కైనా తెగించాలి. ఇతరుల దగ్గర సలహాలు తీసుకోవాలి, ఇతరుల మాటలు వినాలి. కానీ వాటికి ఒక పరిమితి ఉంటుంది. ఎంత మన మంచి కోరేవారైనా ఇతరులు చెప్పేవి అన్ని నమ్మేయ కూడదు. కొన్ని విషయాలను కంటితో చూసి కానీ నిర్ణయం తీసుకోకూడదు.

అలా కాకుండా ప్రతి సారి విని తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేయవచ్చు. కంటితో చూడనివి, మీ చెవులతో స్వయంగా విననివి ఎపుడు నమ్మకూడదు. నమ్మి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొంత మంది చెప్పే మాటల వలన మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తద్వారా మంచి స్నేహాలను, బంధాలను కోల్పోవడమే కాదు కొన్ని కొన్ని సార్లు మనం అందుకోవలసిన విజయాలకు కూడా దూరం అవుతాం. అందుకే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు వినడంలో తప్పు లేదు.

కానీ విన్న తర్వాత ఏది మంచి ఏది చెడు అనే వాటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం అన్ని సార్లు సరికాకపోవచ్చు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ఆలోచించాలి. అంతా ఓకే అనుకున్నాకే వారిచ్చిన సలహాను ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీకు అది బాగా జరిగినా జరగకపోయినా సంతృప్తిగా ఉంటుంది. లేదంటే ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత బాధపడతారు. అందుకే సలహాలు తీసుకోవాలి .. కానీ అంతిమ నిర్ణయం మాత్త్రం మనమే తీసుకోవాలి. మన సమస్య మనకంటే ఎవరికీ సరిగా అర్ధం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: