మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో సంతోషంగా ఉండాలంటే విజయం తప్పనిసరి అయిపోయింది. అయితే ఆ విజయం మీకు ఎలా దక్కిన పర్వాలేదు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆత్మ గౌరవానికి మించిన సంపద, విజయం మరొకటి లేదు. మన ఆత్మ గౌరవాన్ని వదిలి పెట్టి బ్రతకాల్సిన అవసరం లేదు. ఆత్మ గౌరవాన్ని స్వీయ గౌరవంగా కూడా  అంటుంటారు. ఇది విజయం యొక్క ముఖ్య భాగం. ఆత్మగౌరవం అనేది మీ యొక్క స్వంత రూపాన్ని, మీ నమ్మకాలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తన, నడవడికల యొక్క అంచనాలు వంటి మీ గురించి విభిన్నమైన నమ్మకాలను కలిగి ఉంటుంది. ఆత్మ గౌరవం మీలో ప్రేరణ కలిగించి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీపై మీకు నమ్మకాన్ని పెంచి విజయం అందుకోవడంలో ప్రోత్సాహం అందిస్తుంది.

ఆత్మగౌరవం మరియు స్వీయ-సామర్ధ్యం అనేవి వేరుగా అనిపించినా ఇవి రెండిటికీ చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. ఆత్మ గౌరవం ఉన్న చోట సామర్ధ్యం దానికంతటికి అదే పెంపొందించబడుతుంది. ఇది  భవిష్యత్ లో మన చర్యలు, స్వభావం పని తీరును దారిలో పెట్టి సామర్ధ్యాలను నిర్వహించగలమనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలో అనుకున్నది సాధించగలిగే నమ్మకాన్ని మనలో పెంచుతుంది. మీ అంతర్గత ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి. ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ మెల్లగా మన ఆలోచనలను మంచి వైపుకు మరలించాలి.

పాజిటివ్ గా ఉండటం ఆలోచించడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే కాన్ఫిడెంట్ గా చేయాలి. అపుడే త్వరగా సఫలీకృతం అవుతారు. ఏ పని అయినా కొన్ని సార్లు అనారోగ్యం, వయసు,  వృత్తి వైకల్యాలు మరియు భౌతిక పరిమితులు, స్వీయ గౌరవం పై  ప్రభావితం చేయవచ్చు అయినప్పటికీ దృఢంగా నిలబడగలగాలి. ఈ విషయాలను బట్టి మీలో ఆత్మగౌరవం ఉందా? లేదా ఏ విధంగా దీనిని మీరు పొందగలరు అనేది ఓసారి ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: