ప్రస్తుతం మనము ఉన్న జీవితంలో విజయం అనేది ఖచ్చితం అయిపోయింది. ప్రపంచం అంతా విజయం వైపు పరుగులు తీస్తోంది. సమాజంలో విజయం అనేది లేకుంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో లేరు. కాబట్టి విజయం అనేది ఒక మనిషికి కొలమానం అని చెప్పాలి. అయితే విజయం దక్కాలంటే అన్నింటితో పాటుగా మన నోరు కూడా మంచిదై ఉండాలి. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, దానికి అడ్డూ అదుపు ఉండదు అంటుంటారు పెద్దలు. నిజమే మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరాల్లో మాట్లాడే లక్షణం కూడా ఒకటి. మిగిలిన ఏ జీవరాశికి లేని ఈ భాగ్యం ఒక్క మనిషికి మాత్రం అందింది.

అయితే అందిన ఈ అదృష్టాన్ని ఆనందంగా స్వీకరించి సద్వినియోగ పరచుకోవాలి. కానీ దుర్వినియోగపరచకూడదు. చాలా మంది  సందర్భాన్ని బట్టి మాటకు మాట సమాధానంగా ఏవేవో చెప్పేస్తుంటారు. ఇంకొందరు తమ అవసరానికి అనుగుణంగా మాటలు మార్చేస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు నాలుక ఒక విశేషమైన అస్త్రం లాంటిది.  దీనిని మనకు ఉపయోగపడే విధంగా వాడుకుంటే ఎప్పుడూ విజయం చేకూరుతుంది. లేదా ఎలా పడితే అల్లా ఎక్కడ పడితే అక్కడ నోరు జారితే (దుర్వినియోగం చేస్తే) జీవితంలో అపజయం చెందుతాము. మనం ఏమి మాట్లాడుతున్నామ్..?? ఎవరి గురించి మాట్లాడుతున్నాం..?? ఎందుకు మాట్లాడుతున్నామ్..?? అన్న విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు అవసరం ఉన్నంత మేరకు ఏమి మాట్లాడాలో అదే మాట్లాడాలి. ముఖ్యంగా మనము నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రాధాన్యతను బట్టి మాట్లాడాలి. అలా కాకుండా అవసరం లేకపోయినా మాటల మధ్యలో మాటి మాటికీ దూరిపోవడం అన్నది మీ స్వభావాన్ని అందరికీ తెలియచేస్తుంది. మనము నోరును ఎంత అదుపులో పెట్టుకుంటే విజయానికి, గౌరవానికి అంత దగ్గరగా ఉంటారు. మిమ్మల్ని నలుగురిలో మంచి చేయాలన్నా? చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలన్న మీ నోరుతోనే మొదలవుతుంది. కాబట్టి చాలా అవసరం అయితే తప్పితే మాట్లాడకపోవడమే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: