ఈ భూమి పైన జీవించే ప్రతి ఒక్క మనిషికి ఎంతో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. ఆ దిశగానే తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అందుకే వివిధ లక్షాలను ఎంచుకుని ముఞ్చదుకు వెళ్తారు. అందరి లక్ష్యం ఒకటే ఉండదు. అందరికీ ఒకటే మార్గం సులువు కాదు. కొందరికి గమ్యానికి చేరుకునే మార్గంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురయితే, మరి కొందరికి అదృష్టం వలన కాస్త సులభంగానే ఉంటుంది. అయితే చాలా మంది సామాన్యులకు విజయం అసాధ్యం అని అంటుంటారు, అనుకుంటుంటారు.

అలా అనుకునే వారికి చాలా మంది సామాన్యులు వారి సామర్ధ్యంతో అనుకున్నది సాధించి  విజయాన్ని పొంది ఆదర్శంగా నిలిచారు. అయితే మనం ఈ రోజు అలాంటి ఒక వ్యక్తి జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసిన వ్యక్తి, తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం, ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి. నేడు ఎనలేని కీర్తి ప్రతిష్టలు, సంపద సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరు జీవితం కూడా ఒకప్పుడు సామాన్యమైన కుటుంబం నుండే మొదలయ్యింది. ఈ సీనియర్ హీరో కూడా ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తే. కృషి, పట్టుదల, అంకిత భావం ఆయన్ని నేడు ఈ స్థాయికి  చేరుకున్నారు.

ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలతో మొదలయిన కూడా ఎపుడు కూడా నిరుత్సాహ పడలేదులే కష్టమైన, సమస్యలు ఎదురైనా అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగాడే తప్ప వెనుతిరగ లేదు. అపుడు ఆ పరిస్థితులను కనుక ఎదుర్కుని ముందుకు సాగి ఉండక పోతే నేడు మెగాస్టార్ లాంటి నటుడు మనకు  దక్కేవారా? పని ఏదైనా పరిస్థితులు ఏవైనా సరే సంతోషంగా స్వీకరించాలి, అపుడే అనుకున్న తీరాన్ని చేరుకోగలము. నేడు చిరంజీవి అంతటి విలువైన స్థానంలో ఉన్నారు అంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు, అంతా సులభంగా రాలేదు  అలాగని ఆయనకు అసాధ్యం కూడా కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: