జీవితంలో ఎదగాలి అంటే అనుకున్నది సాధించాలి నిజమే. అలాగని అందరికీ ఎదో ఒక లక్ష్యం ఉండాలని లేదు. కానీ చాలా మంది తమ పిల్లలను మీకంటూ ఏదో ఒక లక్ష్యం ఉండాలి అంటూ హితబోధ చేస్తుంటారు, మరి కొందరు తల్లితండ్రులు అయితే లక్ష్యం పేరిట చాలా చాలా విసిగిస్తూ ఉంటారు. తమ పిల్లలు ఖచ్చితంగా గొప్ప లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించి అందరి ముందు గొప్పగా గర్వంగా నిలబడాలని అంతా అనుకుంటారు. కానీ పిల్లల మనసుని వారి మనోభావాల్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించడం కూడా చాలా అవసరం. ముందుగా మీ పిల్లల వైఖరిని గమనించండి, చిన్న తనం నుండే వారికి జీవిత విలువలు చెబుతూ పెంచండి.

నేటి రోజుల్లో వారు ఎలా సంతోషంగా బ్రతకడం కోసం ముందు నుండే ఒక ప్రణాళిక ఉండాలి అన్న విషయాలను వారికి తెలియచేయండి. అలాగని వారికి నచ్చక పోయినా కూడా వారిని ఇలానే ఉండాలి అంటూ ఖచ్చితంగా చెప్పకండి. లేదంటే మొదటికే మోసం వస్తుంది, ప్రణాళిక ముఖ్యమే అలాగని ప్రతి చోట ప్రతి ఒక్కరికీ అది అవసరం ఉండక పోవచ్చు. నిజం చెప్పాలంటే అందరికీ తమ జీవితం ఎలా ఉండాలి అన్న ప్రణాళిక ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే అది సాధ్యపడుతుంది, ప్రతిసారీ ప్రణాళిక ప్రకారం మన జీవితం సాగక పోవచ్చు. మరి కొన్ని సార్లు ప్రణాళిక ఉన్నా మనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.  

అందుకే మీ పిల్లలకు లక్ష్యాన్ని ఎలా ఎంచుకోవాలి ? దానిని సాధించడానికి మార్గాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి ? అసలు లక్ష్యం అవసరమా ? లక్ష్యం వలన మనకు లాభాలు ఏమిటి..?? వంటి విషయాలను వివరించే ప్రయత్నం  చేయండి. అంతేకాని వారికి నచ్చక పోయినా చేయాలంటూ వారి నిర్ణయాలను మరియు ఇష్టాలను పూర్తిగా ఖండించకండి. ఈ రోజు మీ బిడ్డ ఇష్టపడినట్లు చేస్తే సంతోషంగా ఉంటాడు అనిపిస్తే అలాగే వదిలేయండి. తల్లితండ్రులుగా బిడ్డల మనసులో అంత చోటు సంపాదించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: