కేంద్రం  ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసి కళాకారుడు రామచంద్రయ్య, భీమ్లా నాయక్ సినిమా పాటతో ప్రాచుర్యంలోకి వచ్చిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యతో పాటు కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డి.. పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు వీరితో పాటు భారత్ బయోటెక్ సి.ఎం.డి శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులను పద్మ భూషణ్ పురస్కారం వరించింది.
 నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం లోని అవుసలికుంట గ్రామానికి చెందిన వారు మొగిలయ్య. ఆయనకు 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడిగా ప్రపంచంలోనే మంచి పేరు ఉంది. ఆయనక కిన్నెర మొగిలయ్యగా ప్రజలకు సుపరిచితులు అయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ లో పాట పాడి మరింత ఫేమస్ అయ్యారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన వారు రామచంద్రయ్య. ఆయన ఓ నిరక్షరాస్యుడు.కానీ కోయ తెగకు సంబంధించిన జానపద(డోలి, ఓకల్ )కళను అవపాసన పట్టారు. ఆయన కోయ భాషతోపాటు తెలుగు భాషలోనూ తన కళారూపాన్ని ప్రదర్శించగల ప్రావీణ్యులు.కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన ఆయన..తన తెగల వంశ చరిత్రను పారాయణం చేశారు. ఆ కళా ప్రదర్శనలో,గాత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చివరి కళాకారుడు అనే గుర్తింపు కూడా ఉన్నది. కోయ భాషలో ఆ తెగ ప్రజలు పాడుకునే పాటలను నోటిపై ఏ సమయంలోనైనా పలికి కళారూపంలో ప్రదర్శించ గలిగిన నిష్ణాతులు.మేడారం జాతర లోనూ ఆయన తన ప్రదర్శనలతో ఆదివాసులను ఆకట్టుకునేవారు.


 హైదరాబాద్ కు చెందిన పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యకారిణి.హైదరాబాద్ తో పాటు ఫ్లోరిడాలోనూ ప్రణవ్ అకాడమీని స్థాపించి కూచిపూడి నృత్యాన్ని కొత్త తరానికి అందిస్తున్నారు. 1994లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా నాట్య విశారద పురస్కారాన్ని సైతం అందుకున్నారు. 2006లో ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్న అవార్డును అందుకున్నారు. కూచిపూడి నృత్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నారు. వివిధ దేశాల్లో సైతం ఆమె సుమారు మూడు వేలకు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 14వ శతాబ్దం నాటి కాకతీయ నృత్య రూపకం కాకతీయంను ఈతరం ప్రజలకు తనదైన శైలిలో పరిచయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: