తల్లి తండ్రులు బ్రతికేదే పిల్లల కోసం వారు ఏమి చేసిన తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే చేస్తారు. అయితే ఈ క్రమంలో తల్లితండ్రులు చేసే కొన్ని పనులు వారి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని వారికి శాపంగా మారుతుంది అని అంటున్నారు చాణక్యులు. ఈ మహా మహితాత్ముడు అందించిన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించి ప్రతి అంశం గురించి క్లుప్తంగా వివరంచబడి ఉంది.    

అదే విధంగా పిల్లలలో తల్లి తండ్రులు తమవంతు బాధ్యతగా విలువలను ఎలా పెంపొందించాలి అన్న విషయాన్ని కూడా వివరించారు ఆచార్య చాణక్యులు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నది నిజమని నమ్మే చాణుక్యులు ఈయన నీతి శాస్త్రం ప్రకారం వివేకవంతులైన తల్లిదండ్రులు తమ బిడ్డలకు చిన్నతనం నుండే సద్గుణాలతో కూడిన పరిపూర్ణమైన విద్యను అందించాలి అని పేర్కొన్నారు.  ఎందుకంటే మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఎపుడు కూడా ఒకరికి ఆదర్శంగా నిలుస్తాడే తప్ప కళంకంగా మారడు. అలాగే సమాజంలో  గౌరవాన్ని అందుకుని అందరితో ప్రశంచించబడుతారు.

చిన్నప్పటి నుండే పిల్లలు పెరిగే సమయంలో వారి మనసులలో మంచి అలవాట్లు, మంచి గుణాలు అనే బీజాలు నాటితే వారు సత్ప్రవర్తనతో పెరుగుతారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి లేదంటే వారి చెడు త్రోవ పట్టే అవకాశం ఉంది . అలాగే తల్లితండ్రులు ఎలా అయితే వ్యవహరిస్తారో పిల్లలు కూడా వారిని అనుసరిస్తుంటారు. కాబట్టి ముందు మీలో కనుక సద్గుణాలు ఉంది అవి మీ ప్రతి పనిలో కనపడుతూ ఉంటే వాటినే మీ పిల్లలు కూడా ఆచరిస్తూ అదే తరహాలో నేర్చుకుంటూ ఉంటారు. లేదంటే మీరు నాశనమైంది చాలదు అన్నట్టుగా మీ పిల్లల భవిష్యత్తు కూడా స్వయంగా మీ చేతితోనే నాశనం చేసినట్లు అవుతుంది అంటున్నారు  ఆచార్య చాణక్యుడు. తల్లిదండ్రులు వీటిని నిర్లక్ష్యం చేస్తే అది వారి పిల్లల భవిష్యత్తుకు శాపంగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: