శాంతం: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు పెద్దలు. అలాగే మనమంటే గిట్టని వారిని సైతం మనం మనకు దగ్గరయ్యే విధంగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. కుదరని పక్షంలో వారికి దీటుగా నిలబడి అధిగమిస్తూ పయనం కొనసాగించాలి.
దైర్యం: ధైర్యాన్ని ఎప్పటికీ వీడకూడదు. మీ పాజిటివ్ నేచర్ మీకు ఎంతగానో సహాయం చేస్తుంది. దైర్యంగా ఉంటూ మన వల్ల అవుతుంది అనుకుంటే పని సులువుగా అనిపిస్తుంది.
అంచనా: శత్రువును బలహీనంగా అనుకొనవద్దు. ఏ శత్రువు అయినా సరే వారిని తక్కువగా అంచనా వేయకండి. శత్రువును తక్కువ అంచనా వేసి తీరిగ్గా వుంటే అతడు చేయాల్సింది చేసేసి... మనల్ని దాటుకు పోతాడు. మీకంటే బలహీనుడు అయినా సరే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ముందు చూపు: ఉద్యోగమైనా, వ్యాపారమైనా రెండింటి లోనూ మీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. దూర దృష్టి అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రతిసారి ఉండవు. అన్ని సమయాలు మనవి కావు అందుకే ముందు జాగ్రత్త చాలా అవసరం.