అందరికీ కలలు ఉంటాయి. కానీ కొందరే ఆ కలలను సాకారం చేసుకుంటారు. లక్ష్యాన్ని ఛేదించడం అనేది వినడానికి సులువుగా ఉన్నా లక్ష్యాన్ని అందుకోవడం వెనుక చాలానే శ్రమ, పట్టుదల, దృఢ సంకల్పం, మరెన్నో సాహసాలు దాగి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలియదు. ఇదంతా అనుభవం తోనే అవగాహన అవుతుంది. అయితే గట్టిగా ప్రయత్నిస్తే లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీ కాదు. అయితే విజయాన్ని అందుకోవడం కోసం ఈ మూడు సూత్రాలను గుర్తుంచుకోవాలి అలాగే పాటించాలి అని మేదావులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు ముఖ్యమైన సూత్రాలు ఏమిటి అంటే...!!!

సరైన లక్ష్యాన్ని ఎంచుకోవడం:  అసాధ్యమైన లక్ష్యాలను ఎంచుకుని బాధపడటం కన్నా వీలయినంతలో మనకు అనుగుణంగా ఉండే లక్ష్యాలను ఎంచుకుని ప్రయత్నించడం ఉత్తమం.

ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రణాళిక, ప్రయత్నం : లక్ష్యాన్ని ఎంచుకుని మమ అనుకుంటే సరిపోదు, కోరుకున్న లక్ష్యాన్ని చేరాలంటే  అందుకు ఒక మంచి ప్రణాళిక అవసరం. అలాగే ఆ ప్రణాళికను అనుసరించడానికి మీ ప్రయత్నం వెంటనే మొదలు పెట్టాలి. ఎన్ని సార్లు ప్రయత్నిస్తున్నాము అని లెక్కలు వేసుకోకుండా అలుపు అన్న భావన తో ఆగిపోకుండా దృడ సంకల్పంతో, నమ్మకం తో ముందుకు సాగాలి.

అవమానాలను , అపజయాలను అధిగమించండి : మీ ప్రయత్నం లో ఉన్న లోటుపాట్లు వలనో లేక మరేవైనా కారణాల వల్లనో ఒకటి రెండు సార్లు పరాజయం పాలయినా లేక మీ పరాజయాన్ని చూసి ఇతరులు హేళన చేసినా అవమానించినా వాటిని అడుగమించి మళ్ళీ మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి తప్ప నిరాశ పడకూడదు. రేపు మీ విజయాన్ని చూసి మిమ్మల్ని అవమానించిన వారే ప్రశంసించేలా మీరు విజయాన్ని అందుకోవాలి అన్న విషయాన్ని తప్పక గుర్తు చేసుకుంటూ ఉండండి. కాబట్టి మీరు కూడా పైన చెప్పిన విధముగా ఈ మూడు విషయాలను గుర్తుంచుకుని పాటిస్తే మీరు సక్సెస్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: