జీవిత ప్రయాణం లో అందరూ గెలుపు ఓటముల మద్య నలుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి పయనం , పరుగు గెలుపు కొరకే. కానీ అందరికీ అన్నీ సాధ్య పడవు. కొందరు సులభంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మరి కొందరు ఎంతో శ్రమించి, కష్టాలను దాటితే కానీ విజయాన్ని అందుకోలేరు. ఇంకొందరు ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించలేక బాధపడుతుంటారు. అయితే కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కొన్ని సూత్రాలను తప్పక పాటించాలి, మన ప్రయత్నం అనేది ఇక్కడ ప్రదానం. కాగా ఇపుడు లక్ష్యం కోసం పాటించాల్సిన ఆ ముఖ్య సూత్రాలను గురించి తెలుసుకుందాం.

కృషి, పట్టుదల అనేవి ప్రదమం అని తెలిసిందే. అయితే వీటితో పాటుగా... ఎక్కడ ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నేర్పుగా అన్నిటినీ చక్కబెట్టాలి అన్న అంశాలను కూడా తెలుసుకోవడం అవసరం.  అదే విధంగా అందరినీ అన్ని సార్లు నమ్మకూడదు, కొన్ని సార్లు ఇతరుల ప్రమేయం అస్సలు లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొందరు తమ సన్నిహితులు అనో లేక తమ శ్రేయోభిలాషులో అని కొందరికి తమ సమస్యలను , వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు.

అయితే ఇది అన్నిసార్లు మంచిది కాదు. ఎందుకంటే కొందరు మనం అంటే మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ మనం ఎక్కడ వారికన్నా గొప్పగా అవుతామో అన్న అభిప్రాయంతో కూడా సరైన సలహాలు చెప్పక పోవచ్చు. అందరూ అలానే ఉంటాము అని చెప్పలేము. కానీ... మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అందుకే ప్రతి ఒక్క విషయంలో  కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అన్న అవగాహన తప్పక ఉండాలి. లేదంటే వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరు మీకు సపోర్ట్ చేసినా చేయకున్నా లైఫ్ లో విజయం కోసం పరుగులు ఆపకుండా వెళుతూనే ఉండాలి. అప్పుడే ఇదొక రోజు మీరు తప్పక అనుకున్నది సాధిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: