అమ్మ అని పిలిపించుకోవడం దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం. అయితే బయట ఏదిపడితే అది తింటే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. !ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవారికి  ఇది నిజంగా షాకింగ్ న్యూసే. మహిళలు ఫాస్ట్‌ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు తప్పవని పేర్కొంది.పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటివి సంతాన సామర్థ్యం తగ్గిస్తాయట.  



మద్యపానం, ధూమపానం, వయసు, శరీరతత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం చేశారు. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తింటూ, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చుతున్నారని తేల్చారు.అందుకనే పిల్లలు కావాలని కోరుకునే వారు వీలయినంత వరకు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. వీటిలో అధిక కొవ్వులు నిలవాలి ఉంటాయి.



అలాగే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల శరీరం బరువు పెరుగుతారు. బరువు పెరిగితే పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తినక పోవడం మంచిది. త్వరగా ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండండి. అలాగే సిగరెట్టు ధూమపానం చేయడం కూడా పిల్లలు పుట్టక పోవడానికి ఒక కారణం గా పరిగణించవచ్చు. సాధ్యమైనంత వరకు సిగరెట్లు ధూమ పానానికి కూడా దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా పండ్లు తినాలి. అలాగే బాగా వేయించిన నూనె పదార్థాలు కూడా తినకుండా ఉంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: