మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రము నుండి వచ్చిన సుప్రసిద్ధ సింగర్ శ్రీ ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె జ్ఞాపకాలను ఒకసారి ఎంమారువేసుకునే ప్రయత్నమే మా ఈ ఆర్టికల్. మన దేశంలో ఎందరో నారీమణులు అనేక రంగాలలో పురుషులతో పాటు సమానంగా రాణిస్తూ ముందుకు వెళుతున్నారు. మన ఈ గాయని సుబ్బులక్ష్మి గారు సంగీతాన్ని తన ప్రపంచంగా భావించారు. ఈమె సినిమాలో కూడా నటించింది. సుబ్బులక్ష్మి తల్లి వీణ విద్వాంసురాలు కావడం మూలాన ఈమెకు సంగీతం మీద ఆసక్తి కలిగిందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సంగీతం అంటే ఈమెకు ఇష్టమే కాకుండా భక్తి కూడా, ఈ లక్షణం మాత్రం ఆమె తండ్రి గారి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సుబ్బులక్ష్మి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు గుడిలో పడిన ఒక పాట ద్వారా మొదలైన తన సంగీత ప్రస్థానం మొదలైంది. ఇక ఆనాటి నుండి తన జీవితంలో మరుపురాని మరిచిపోలేని ఎన్నో పాటలు, కృతులు, కీర్తనలు, లలితగీతాలు, భజనలు, జానపద గేయాలు మరియు దేశ భక్తి గీతాలను పాడి చరిత్ర సృష్టించారు. ఈమె ఏ భాషలో పాట పడినా ఈమెదు ఈ భాషేనేమో అన్న ఫీలింగ్ వింటున్న వారిలో కలుగుతుంది. అంత స్పష్టంగా పడగల నైపుణ్యం ఆమె సొంతం. మన దేశంలో ప్రసిద్ధి గాంచిన సంగీత విద్వాంసులు త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితార్ మరియు శ్యామశాస్త్రి వంటి వారు స్వరపరిచిన పాటలకు ఒక రూపాన్నిచ్చిన ఘనత ఈమె సొంతం.

ఇలా సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలను పొందారు. ఒకసారి సుబ్బులక్ష్మి ఇంగ్లాండ్ లో ఒక తన పాటల ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అంతా సిద్ధమైంది. సుబ్బులక్ష్మి పాడిన పాటలకు అప్పటి ఇంగ్లాండ్ రాణి ఎంతో పరవశించిపోయింది. స్వయంగా ఇంగ్లాండ్ రాణి సుబ్బులక్ష్మిని అభినందించడం జరిగింది. ఇంగ్లాండ్ రానికి భారతీయ మహిళ సత్తా ఏమిటో తన గాత్రం ద్వారా తెలిపిందని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. ఈ రోజు సుబ్బులక్ష్మి మన మధ్యన లేకపోయినా ఆమె ఒక గాయకురాలిగా ఎప్పటికీ మన మదిలో నిలిచి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: