గర్భం దాల్చడం అనేది ప్రతి మహిళ చాలా అదృష్టంగా భావిస్తారు. గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భధారణ సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.. కడుపులోని బిడ్డ కోసం వాటిని ఎంతో ఆనందంగా తట్టుకుంటుంది. అంతేకాదు.. ఆ సమయంలో చాలా మంది గర్భిణులు సమస్య నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో గర్భిణులు కొన్ని కారణాల వలన సరిగ్గా నిద్రపోరు.

అయితే అలాంటి సమయంలో కొన్ని టిప్స్ పాటిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఇక సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలు చేసే పొరపాటు.. పగటి పూట నిద్ర పోతుంటారు. ఆలా చేయడం వల్ల రాత్రి నిద్రకు ఆటకం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు పగటి పూట నిద్రకు దూరం ఉంటే.. రాత్రి నిద్ర బాగా పడుతుందని సూచించారు. అంతేకాదు.. రాత్రి సమయంలో త్వరగా, ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే.. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.

ఇక ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేయడంతో పాటు నిద్రలేమిని కూడా దూరం చేస్తుందని తెలిపారు. అంతేకాదు.. గర్భధారణ సమయంలో రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే.. ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయని అన్నారు. అంతేకాదు.. అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిన విదితమే. అందుకే నిద్రించే ముందు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఒక అరటి పండు తీసుకుంటే.. త్వరగా, ప్రశాంతంగా నిద్ర పడుతుందని తెలిపారు. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ స్త్రీలు ప్రతి రోజు శరీరానికి సరిపడా నీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఆలా తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: