మాతృత్వం అనే ప్రతి స్త్రీ కోరిక. అమ్మ అని పిలుపు కోసం తారసపడే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఆరోగ్య లోపాల వల్ల గర్భధారణ కాని వాళ్లు ఎంతో మంది ఉంటారు. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వాళ్లని చూస్తుంటాం. గర్భధారణ విషయంలో.. ఆరోగ్యకరమైన గర్భం విషయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హెల్తీ బేబి పుట్టాలనుకునే వాళ్లు అన్ని రకాలు జాగ్రత్తలు తెలుసుకోవాలి.

గర్భధారణపై అవగాహన..

 
మహిళలు గర్భధారణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. గర్భధారణ జరినప్పుడు శరీరంలో జరిగే పరివర్తనలు, ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవాలి. దీనివల్ల మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉండొచ్చు. ఎప్పుడూ పాజిటివ్ వేలోనే విషయాలను తెలుసుకోండి. చేదు అనుభవాలను తెలుసుకోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏం తినకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి. తల్లి ఎంత ఆరోగ్యంగా.. సంతోషంగా ఉంటే.. పుట్టే పిల్లాడు కూడా అంతే హెల్తీగా ఉంటాడు. పుట్టిన పిల్లాడికి తల్లిపాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి.

ఆరోగ్యకరమైన బరువు కోసం..


గర్భిణీ స్త్రీలు సాధారణంగా బరువు పెరుగుతారు. అలా అని అధిక బరువు మంచిది కాదు. అధిక బరువు వల్ల ప్రెగ్నెన్సీ టైంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. బరువు అధికంగా కాకుండా.. మరీ తక్కువగా కాకుండా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేలా చూసుకోండి. గర్భధారణ సమయంలో 10 నుంచి 12 కిలోల వరకు బరువు ఉండేలా చూసుకోవాలి. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా లభించే ఫ్రూట్స్, ఆకుకూరలు తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. వైద్యులు తెలిపిన సూచనలు తప్పక పాటించండి. ప్రతి రోజు వ్యాయామం, వాకింగ్, స్విమ్మింగ్‌ చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. పౌష్టికాహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గర్భధారణ సమయంలో సాధారణంగా తిమ్మిర్లు, డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు వస్తుంటాయి. రోజువారి వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: