ప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వడం కోసం ఎంతగానో ఆరాటపడుతూ ఉంటుంది. సాధారణంగా డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ మరింత భయం వెంటాడుతూ ఉంటుంది. ఇక వారికీ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని కొందరు కంగారు పడుతూ బీపీని పెంచుకుంటూ ఉంటారు. ఇక నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని వ్యాయామ పద్ధతులు బాగా సహాయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతులను అనుసరించడం ద్వారా నార్మల్ డెలివరీ అవుతుందని చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో పైనాపిల్ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. గర్భం దాల్చిన మొదట్లో గర్భిణులు  పైనాపిల్ ని అస్సలు తినకూడదు. వాటిని గర్భిణీలు కి డేట్ దగ్గర పడే కొద్దీ పైనాపిల్ బాగా సహాయం చేస్తుందని చెబుతున్నారు. కాగా.. పైనాపిల్ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. పైనాపిల్ లో బ్రోమేలైన్ అనే ఎంజైమ్ ఉండి.. అది నార్మల్ డెలివరీకి సహాయం చేస్తుందని చెబుతున్నారు. అందుకే గర్భిణీలు పైనాపిల్ తీసుకుంటే మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన  ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఖర్జూరం తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని వెల్లడించారు. ఇక ఖర్జూరంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మీరు షుగర్ ఫుడ్ ని తినకుండా వీటిని తీసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో గెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఖర్జూరం తీసుకోకూడదని తెలిపారు.

ఇక పచ్చి బొప్పాయిని తీసుకుంటే కూడా గర్భిణీలు నార్మల్ డెలివరీ అవుతుందని తెలిపారు. అయితే ప్రెగ్నెన్సీ మొదట్లోపచ్చి బొప్పాయి అస్సలు తినకూడదని తెలిపారు. కాగా.. గర్భిణీలు ఆఖరి రోజుల్లో దీనిని తీసుకుంటే నార్మల్ డెలివరీకి ఇది సహాయం చేస్తుందని వెల్లడించారు. బొప్పాయి కూడా గర్భిణీలకి నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం చేస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: